Karan Johar: రూ.5 కోట్లు రాబట్టే హీరోలకు రూ.20 కోట్ల రెమ్యునరేషన్

  • January 9, 2023 / 04:35 PM IST

ప్రముఖ బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ హీరోల రెమ్యునరేషన్స్ పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కరణ్ జోహార్ నిర్మాతగా ఎన్ని భారీ బడ్జెట్ సినిమాలు తీశారు. చాలా మంది స్టార్ కిడ్స్ ను లాంచ్ చేసి వారికి కెరీర్ అందించారు. అయితే ఇప్పుడు హీరోలు తీసుకుంటున్న రెమ్యునరేషన్స్ కి వారి సినిమాలకు వచ్చే కలెక్షన్స్ కి సంబంధం ఉండడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మాస్టర్ యూనియన్ పాడ్ కాస్ట్ లో కరణ్ జోహార్ ఈ విషయాలను వెల్లడించారు.

తన సొంత ప్రొడక్షన్ హౌస్ ను కేవలం ఇద్దరు వ్యక్తులతో కలిసి స్థాపించానని.. అప్పట్లో తన ప్రొడక్షన్ హౌస్ ఒక అంకుర సంస్థలా ఉండేదని అన్నారు. ఆ సమయంలో యష్ చోప్రా తనకొక మాట చెప్పారని.. సినిమా ఎప్పుడూ ఫెయిల్ అవ్వదు, దానికి పెట్టే బడ్జెట్ ఫెయిల్ అవుతుందని అన్నారు. అలియా భట్, సిద్ధార్థ్ మల్హోత్రా, వరుణ్‌ ధావన్‌లతో కలిసి ‘స్టూడెంట్ ఆఫ్‌ ది ఇయర్’ అనే సినిమా తీశానని.. బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా చిత్రీకరించామని..

సినిమా హిట్‌ అయింది కానీ, తను మాత్రం నష్టపోయానని అన్నారు.ఆ బాధ నుంచి బయటపడడానికి రోజూ రాత్రిళ్లు టాబ్లెట్ వేసుకుని పడుకునేవాడినని. హిందీ సినిమా అంటే తనకు చాలా ఇష్టమని కానీ బిజినెస్‌ కోణంలో చూస్తే.. టాలీవుడ్ చాలా బెటర్‌ అని అన్నారు. బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో.. సినిమా కంటే ఎక్కువ శాతం లాభపడేది అందులోని నటీనటులేనని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ విషయం చెప్తే తనను చంపేస్తారని..

కానీ రూ.5 కోట్లు వసూళ్లు రాబట్టగలిగే హీరోలు రూ.20 కోట్లు నుంచి రూ.35 కోట్లు తీసుకుంటూ ఉంటారని.. ఇది ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. బాలీవుడ్‌ని పట్టి పీడిస్తున్న ఈ రోగానికి మాత్రం వ్యాక్సిన్ లేదని అన్నారు. ఈ ఇండస్ట్రీలో బ్లాక్ మనీ అంటూ ఏమీ లేదని.. తమకు బయటి నుంచి ఎలాంటి ఫండ్స్ రావంటూ ఆవేదన వ్యక్తం చేసారు కరణ్‌ జోహార్.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus