తెలుగు సినీ ఇండస్ట్రీలో నటిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగినటువంటి వారిలో కరాటే కళ్యాణి ఒకరు ఈమె ఇటీవల కాలంలో వివాదాలకు కాస్త దూరంగా ఉన్నప్పటికీ తాజాగా మరోసారి సోషల్ మీడియా వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల నంది అవార్డుల గురించి పలు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. చిత్ర పరిశ్రమలోని కళాకారులు అందరికీ నంది అవార్డులతో గౌరవించడం గత కొన్ని సంవత్సరాలుగా వస్తోంది.
అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి నంది అవార్డులను ప్రకటిస్తున్నారు. అయితే నంది అవార్డుల పేరును గద్దర్ అవార్డులుగా మార్చిన సంగతి తెలిసిందే. ఇలా గద్దర్ జయంతి రోజున కళాకారులకు గద్దర్ అవార్డులతో సత్కరిస్తామని తెలిపారు.ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి నంది అవార్డులను గద్దర్ అవార్డులుగా మార్చడంతో ఈ విషయంపై కరాటే కళ్యాణి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
గద్దర్ గారి పేరు మీద అవార్డులు ఇవ్వడం ఇబ్బందే అయినా.. అది మీ ఇష్టం. తప్పేమీ లేదు కానీ.. అత్యుత్తమమైన నంది అవార్డుల పేరు మారిస్తే ఏ సీఎం అయినా తప్పే.. నంది చూసుకుంటాడులే అంటూ ఈమె పోస్ట్ చేశారు. అంతేకాకుండా తాను గాడ్సే అవార్డులను కూడా ఇస్తానని, అప్లికేషన్స్ పెట్టుకోండి. దేశభక్తి, దైవభక్తి ఉంటేనే అర్హులంటూ (Karate Kalyani) ఈమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.