‘హను – మాన్’ (Hanuman) సినిమాతో పాన్ ఇండియా దర్శకుడు అయిపోయారు ప్రశాంత్ వర్మ (Prasanth Varma) . ఆ సినిమా తర్వాత తన సినిమాటిక్ యూనివర్స్‌లో వరుస సినిమాలు తెరకెక్కిస్తారు అని అనుకునర్నారంతా. అనుకున్నట్లుగా బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్‌తో (Ranveer Singh) సినిమా అనౌన్స్ చేశారు. కానీ ఆ సినిమా తొలి దశలోనే ఆగిపోయింది. దీంతో ప్రశాంత్ వర్మకు ఏమైంది, ఆయన సినిమా విశ్వానికి ఏమైంది అనే చర్చలు మొదలయ్యాయి. ఇక ఆ సినిమాలు లేనట్లేనా అని కూడా అనుకున్నారు.
Prasanth Varma
అయితే.. ఆయన సినిమా ప్రపంచం అక్కడితో ఆగిపోవడం లేదు. దాని కోసం ఆయన వివిధ సినిమా ఇండస్ట్రీల్లో స్టార్ హీరోలను, కీలక నటులను సంప్రదిస్తున్నారు. అయితే ఈ ప్రక్రియకు ఇప్పుడు చిన్న గ్యాప్ మాత్రమే ఇచ్చారు. ఈ గ్యాప్‌లో నందమూరి బాలకృష్ణ (Balakrishna) వారసుడు మోక్షజ్ఞను (Nandamuri Mokshagna) వెండితెరకు పరిచయం చేయనున్నారు. ఈ సినిమాకు టాలీవుడ్‌లో ఇప్పుడు ఉన్నంత హైప్ ఇప్పుడు ఏ పాన్ ఇండియా సినిమాలకూ ఉండదు అని చెప్పొచ్చు.
అందుకే.. ఈ సినిమా తర్వాత తన సినిమాటిక్ యూనివర్స్ రెడీ చేసే ప్లాన్‌లో ఉన్నారట. కొన్ని రూమర్స్ ప్రకారం అయితే ఇప్పుడు మోక్షుతో చేస్తున్న సినిమా కూడా ఆ సినిమా విశ్వానికి చెందినదే అయి ఉంటుంది. అయితే ఈ విషయంలో క్లారిటీ లేదు. ఆ విషయం పక్కన పెడితే ప్రశాంత్ వర్మ ప్లానింగ్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాళీ నటులు చాలామంది ఉన్నారట. వీరందరితో ప్రశాంత్ వర్మ సినిమా విశ్వం రెడీ చేస్తారట.
ఈ మాటలకు ఊతమిచ్చేలా ఇటీవల ‘సత్యం సుందరం’ (Sathyam Sundaram) ప్రెస్ మీట్‌లో కొన్ని మాటలు వినిపించాయి. ఈ సినిమాటిక్ యూనివర్శ్‌లో తమిళ హీరో కార్తీ (Karthi) నటిస్తున్నట్టు సమాచారం. కార్తిని అప్రోచ్ అయ్యాను ప్రశాంత్ వర్మనే చెప్పారు. అయితే అది ఏ సినిమా కోసం అనేది చెప్పలేదు. మోక్షు సినిమాకు అయితే కాకపోవచ్చు. కాబట్టి ‘హను – మాన్’ సీక్వెల్ ‘జై హనుమాన్’ కోసమా? లేక ఆ తర్వాతి సిరీస్ సినిమా కోసమా అనేది చూడాలి.