ఈ మధ్య సామాన్యులకు మాత్రమే కాదు.. సెలబ్రిటీలకు కూడా భద్రత లేకుండా పోతుంది.గతంలో చూసుకుంటే.. షారుఖ్ ఖాన్ ఇంట్లోకి అజ్ఞాత వ్యక్తులు చొరబడి చేసిన రచ్చ అందరికీ తెలిసిందే. ఇక సల్మాన్ ఖాన్ (Salman Khan) కి అయితే ‘చంపేస్తాం’ అంటూ బెదిరింపు కాల్స్ వచ్చాయి.ఇంకా కొంతమంది సినీ నటులు ఇంట్లో చోరీలు జరిగిన వార్తలు కూడా అందరం చూశాం. హై స్టాండర్డ్స్ సెక్యూరిటీ కలిగిన సెలబ్రిటీల ఇళ్లల్లో కూడా ఇలా దొంగతనాలు జరగడం అనేది అందరికీ ఒకింత ఆశ్చర్యకరంగా..
అలాగే షాకింగ్ గా అనిపించవచ్చు. ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. తాజాగా మోహన్ బాబు (Mohan Babu) ఇంట్లో చోరీ జరగడం అనేది అందరికీ షాకిచ్చింది. దీంతో మోహన్ బాబు పోలీస్ స్టేషన్ మెట్లెక్కాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. సినీ నటుడు మోహన్ బాబు ఇంట్లో రూ.10 లక్షలు చోరీ జరిగిందట. మోహన్ బాబు పనిమనిషి నాయక్.. రూ.10 లక్షలు చోరీ చేసి పారిపోయినట్టు.. రాచకొండ సీపీకి ఫిర్యాదు చేశారట మోహన్ బాబు. దీంతో ఈ విషయం హాట్ టాపిక్ అయ్యింది. వాస్తవానికి… స్టార్లు రూ.10 లక్షలు వంటి అమౌంట్..కి ఇలా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు.
వాళ్లకి అది పెద్ద అమౌంట్ అని కూడా చెప్పడానికి లేదు. కానీ ‘మోహన్ బాబు రూ.10 లక్షలకి కేసు పెట్టడం అనేది.. చాలా అనుమానాలకు దారి తీస్తుంది’ అని నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు. ‘తన పని మనిషిపై కోపంతో… కావాలనే ఆయన ఇలా కేసు పెట్టి ఇరికిస్తున్నట్టు ఉన్నారు’ అంటూ కొంతమంది నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. కానీ మోహన్ బాబు.. చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. తన కాంపౌండ్లో ఎటువంటి పొరపాటు జరిగినా.. ఊరుకోరు. బహుశా అలా కూడా అనుకోవచ్చు.