కార్తీక దీపం డైరెక్టర్ కాపుగంటి రాజేంద్ర గురించి చాలామందికి తెలియదు. ఆయన కెరీర్ మొదట సినిమాలతోనే మొదలైంది. దాదాపు 40 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో ఉంటున్నారు. అయితే ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కెరీర్ గురించి మాట్లాడుతూ ఎంతో ముఖ్యమైన ఆఫర్స్ మిస్సయినట్లు చెప్పారు. పవన్ కళ్యాణ్ సినిమాతో పాటు సౌందర్య మరణం కూడా తన కెరీర్ పై ప్రభావం చూపినట్లు చెప్పుకొచ్చారు. ముందుగా గీత ఆర్ట్స్ లో డబ్బు భలే జబ్బు అనే సినిమా చేశాను.
ఆ సినిమాకు మంచి గుర్తింపు రావడంతో మళ్ళీ అదే బ్యానర్ లో పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే అవకాశం వచ్చింది. కానీ దురదృష్టవశాత్తు ఆ ప్రాజెక్ట్ రెండు సార్లు పట్టాలెక్కి మరి ఆగిపోయింది. ఇక మోహన్ బాబుతో శివ శంకర సినిమా చేసినప్పుడు షూటింగ్ మధ్యలోనే సౌందర్య మరణించడం ఆ సినిమాపై భారీ ఎఫెక్ట్ పట్టింది. 60% షూటింగ్ అయిపోగానే సౌందర్య బీజేపీ ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం మోహన్ బాబు దగ్గర పర్మిషన్ తీసుకున్నారు.
నిజానికి షూటింగ్ మధ్యలో ఎవరైనా అలా చేస్తే మోహన్ బాబు ఒప్పుకోరు. కానీ సౌందర్య కాబట్టి ఆమె పరిస్థితిని అర్థం చేసుకొని అడగ్గానే పంపించేశారు. ఆ రోజు గనక ఆయన వద్దని చెప్పి ఉంటే సౌందర్య బ్రతికి ఉండేవారు. ఆమె మృతి వలన సినిమా క్లైమాక్స్ ను పూర్తిగా మార్చేశాము. కానీ ఆ సినిమా ప్లాప్ అయ్యింది.. అని రాజేంద్ర వివరణ ఇచ్చారు.