Karthikeya: హిట్‌ సీక్వెల్‌పై క్లారిటీ ఇచ్చిన కార్తికేయ… ఏం చెప్పాడంటే?

కార్తికేయ గుమ్మకొండ… ఈ పేరు టాలీవుడ్‌ జనాలకు తెలిసింది అంటే దానికి కారణం ‘ఆర్‌ఎక్స్‌ 100’. అందులో కార్తికేయ లవర్‌గా కనిపించిన విధానం, యాటిట్యూడ్‌, లుక్స్‌.. అన్నీ డిఫరెంట్‌గా ఉంటాయి. ఆ సినిమాలో హీరో పాత్ర చిత్రణ అంతలా అదిరిపోయింది కూడా. సినిమాలో ప్రేమ సన్నివేశాల వేడి, మాస్‌ సన్నివేశాలు అదిరిపోయాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ఎందుకు అనుకుంటున్నారా? ఎందుకంటే ఈ సినిమాకు సీక్వెల్‌ రెడీ అవుతోంది అనే టాక్‌ నడుస్తోంది కాబట్టి. అయితే దీనిపై హీరో కార్తికేయ క్లారిటీ ఇచ్చేశాడు.

కార్తికేయ (Karthikeya) కెరీర్‌ను చాలా భిన్నంగా ప్రారంభించాడు. ‘ఆర్‌ఎక్స్‌ 100’ సినిమాతో హిట్‌ హీరోగా కెరీర్‌ ప్రారంభించాడు. అయితే అప్పటికే ‘ప్రేమతో మీ కార్తిక్‌’ అనే సినిమా వచ్చింది. అయితే ఆ సినిమా వచ్చినట్లే ఎవరికీ తెలియదు. ‘ఆర్‌ఎక్స్‌ 100’ తర్వాత ‘హిప్పీ’, ‘గుణ 369’ సినిమాలు చేశాడు. ఇవన్నీ సరైన ఫలితం అందుకోలేదు. సరిగ్గా ఈ సమయంలో ‘నాని గ్యాంగ్‌లీడర్‌’ సినిమాలో విలన్‌గా కనిపించాడు. ఆ తర్వాత వరుసగా మూడు సినిమాలు (90ఎంఎల్, చావు కబురు చల్లగా, రాజా విక్రమార్క) పోయాయి. మళ్లీ ‘వలిమై’లో విలన్‌గా కనిపించాడు.

ఇప్పుడు తిరిగి హీరోగా కెరీర్‌ను రీబిల్డ్‌ చేసుకునే పనిలో పడ్డాడు. అందులో భాగంగా తొలి సినిమా ‘బెదురులంక 2012’ చేశాడు. ఈ సినిమా ప్రచారంలో భాగంగా తన కెరీర్‌ గురించి మాట్లాడాడు కార్తికేయ. ఒక్కో సినిమా నుండి ఒక్కో విషయం నేర్చుకుంటాను. ప్రతి సినిమా విజయం సాధించాలనే చేస్తాను. కానీ ఆశించిన ఫలితం రానప్పుడు… ఎక్కడ తప్పు జరిగిందని ఆలోచిస్తాను. అంటూ తన కెరీర్‌ను చూసే విధానం గురించి చెప్పుకొచ్చాడు కార్తికేయ.

ఇక కొత్త సినిమాల గురించి చెప్పమంటే… యూవీ క్రియేషన్స్‌లో కొత్త దర్శకుడు ప్రశాంత్‌తో ఓ సినిమా చేస్తున్నానని చెప్పాడు. ఇవి కాకుండా మరో మూడు చిత్రాలు చర్చల దశలో ఉన్నాయని తెలిపాడు. మరి ‘ఆర్‌ఎక్స్‌100’కు సీక్వెల్‌ ఉంటుందని ప్రచారం వినిపిస్తోంది. నిజమేనా అని అడిగితే.. ‘ఆర్‌ఎక్స్‌100’ సీక్వెల్‌ కాదు కానీ, అజయ్‌ భూపతితో మరో సినిమా చేసే ఆలోచన ఉందని చెప్పాడు.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus