Karthikeya: ఆ సెంటిమెంట్ వల్ల కార్తికేయ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ చేరనుందా?

ఆర్.ఎక్స్ 100 సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న కార్తికేయ ఈ సినిమా తర్వాత ఎక్కువ సంఖ్యలో సినిమాలలో నటించినా ఆ సినిమాలలో మెజారిటీ సినిమాలు ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. టాలెంట్ ఉన్నా కార్తికేయకు ఆశించిన స్థాయిలో సక్సెస్ దక్కకపోవడం ఫ్యాన్స్ ను ఎంతగానో బాధ పెట్టింది. ఆర్.ఎక్స్ 100 సినిమాలో కార్తికేయ రోల్ పేరు శివ కాగా బెదురులంక 2012లో కూడా కార్తికేయ రోల్ పేరు అదే కావడం గమనార్హం.

ఆర్.ఎక్స్ 100 మూవీ గోదావరి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కగా బెదురులంక 2012 కూడా గోదావరి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కడం గమనార్హం. ఈ సెంటిమెంట్ల ప్రకారం బెదురులంక 2012 బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుని రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందని కార్తికేయ నమ్ముతున్నారు. కార్తికేయ నమ్మకం ఈ సినిమా విషయంలో నిజమవుతుందో లేదో చూడాల్సి ఉంది. డీజే టిల్లు ఫేమ్ నేహాశెట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించారు.

బెదురులంక 2012 సినిమాతో మరో సక్సెస్ తన ఖాతాలో నమ్ముతుందని ఆమె భావిస్తున్నారు. 2012 సంవత్సరం అంటే యుగాంతం గుర్తుకొస్తుందని 2012లో నేను కాలేజ్ లో చదువుకుంటున్నానని కార్తికేయ తెలిపారు. ఆ సమయంలో యుగాంతం గురించి రెండు మూడు హాలీవుడ్ సినిమాలు సైతం వచ్చాయని కార్తికేయ కామెంట్లు చేశారు. బెదురులంక 2012 సినిమాలో ఫన్, మెసేజ్ రెండూ ఉన్నాయని కార్తికేయ (Karthikeya) చెప్పుకొచ్చారు.

ఆర్జీవీ దగ్గర పని చేసిన క్లాక్స్ ఈ సినిమాకు దర్శకుడు అనే సంగతి తెలిసిందే. కార్తికేయకు భారీ బ్లాక్ బస్టర్ హిట్ రావాలని ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు. ఈ నెల 25న విడుదలవుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది. కార్తికేయ ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కార్తికేయను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోంది.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus