Karthikeya: సిద్దు నో చెప్పడంతో అతన్ని ఫైనల్ చేసేశారా?

మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమా ద్వారా మంచి సక్సెస్ అందుకున్నారు. త్వరలో మెహర్ రమేష్ దర్శకత్వంలో చేసిన భోళా శంకర్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యారు. ఆగస్టు 11న ఈ సినిమా విడుదలకు కానుంది. ప్రమోషన్స్ ను ఫుల్ స్వింగ్ లవ్ మొదలుపెట్టారు. నిన్న ఓ పాట రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా…చిరు తన తదుపరి చిత్రాన్ని కళ్యాణ్ కృష్ణ కురసాలా దర్శకత్వంలో చేయడానికి రెడీ అవుతున్నాడు.

చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. బ్రో డాడీ అనే సినిమాకు రీమేక్ గా ఈ చిత్రం అని రూపొందింది. ఈ సినిమాలో చిరంజీవి తండ్రి పాత్రలో నటిస్తుండగా…అతని కొడుకు పాత్ర కోసం సిద్దు జొన్నలగడ్డని సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. కానీ కాల్ షీట్స్ ఖాళీ లేక అతను తప్పుకున్నట్టు టాక్ నడుస్తోంది. మరి ఈ పాత్రకి ఏ యంగ్ హీరోని ఎంపిక చేస్తారు అనే చర్చలు కూడా జరుగుతున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం..

ఈ పాత్రకి సంతోష్ శోభన్ ను సంప్రదించారని తెలుస్తుంది. ఇతను శ్రీదేవి శోభన్ బాబు అనే సినిమాని సుస్మిత నిర్మాణంలో చేశాడు. అందువల్ల చిరుకి తనయుడి పాత్రకి ఇతమైతే సరిపోతాడు అని సంప్రదించారు అని తెలుస్తుంది. కానీ ఇతను కూడా మరో మూడు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండటం వల్ల ఆర్.ఎక్స్.100 హీరో కార్తికేయని (Karthikeya) సంప్రదించిందట టీమ్. అతను ఈ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus