ప్రెగ్నన్సీపై స్టార్‌ హీరోయిన్‌ షాకింగ్‌ కామెంట్స్‌.. ఏమందంటే?

బాలీవుడ్‌లో కొన్ని జంటలు చేసిన పని వల్ల ఏ హీరోయిన్‌ కాస్త లూజు డ్రెస్‌ వేసుకున్నా, ఆరోగ్యం సుస్తీ చేసి ఆసుపత్రికి వెళ్లినా, కొన్ని రోజులపాటు బయటి ప్రపంచానికి కనిపించకపోయినా.. ‘ఏంటీ ప్రెగ్నంటా?’ అనే ప్రశ్న ఎదురవుతోంది. అది అడిగేవాళ్ల తప్పా? అంటే కానే కాదు. ఎందుకంటే పెళ్లి అయిన మూడు నెలలకే ఆరు నెలల గర్భంతో కనిపించిన నాయికలు ఉన్నారు మరి. అలా ప్రముఖ కథానాయిక కట్రినా కైఫ్‌ (Katrina Kaif) కూడా గర్భవతి అనుకుంటున్నారు బాలీవుడ్‌ జనాలు.

ఈ క్రమంలో ఆమె విషయంలో వస్తున్న పుకార్ల గురించి కట్రినా కైఫ్‌ ఇటీవల స్పందించింది. ఈ క్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేసింది. తన కొత్త చిత్రం ప్రచారంలో భాగంగా కట్రినా కైఫ్‌ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలు చెప్పుకొచ్చింది. ‘మీరు ప్రెగ్నంట్‌ అట కదా’ అనే ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానంతో ఇకనైనా ఆమె మీద వస్తున్న పుకార్లకు ఫుల్‌ స్టాప్‌ పడుతుందేమో చూడాలి. అది ఓకే కానీ.. ఆమె ఏమందో చెప్పలేదు అని అంటారా?

ఓకే ఓకే.. నేను గర్భవతిని అయ్యాననే శుభవార్త ఉంటే మేమే స్వయంగా మీతో పంచుకుంటాం. సరైన సమయం వచ్చినప్పుడు ఆ విషయాన్ని చెప్పడానికి సిగ్గుపడం అని క్లియర్‌ చేసేసింది కట్రినా. పెళ్లి తర్వాత ప్రతి ఒక్కరిలో మార్పు వస్తుంది. మరో వ్యక్తితో కలసి జీవితాన్ని ప్రారంభించడం పెద్ద విషయం. అప్పటివరకు మన కోసం ఆలోచిస్తాం. పెళ్లి తర్వాత ఇద్దరి గురించి ఆలోచించాలి అని పెళ్లి గురించి చెప్పాడు భర్త విక్కీ కౌశల్‌.

నా 36 ఏళ్ల జీవితంలో 33 ఏళ్ల కంటే గత రెండున్నరేళ్లలోనే ఎక్కువ ఉన్నతంగా ఆలోచించాను అని మరింత క్లియర్‌ చేశాడు. దీంతో ఇకనైనా పుకార్లు ఆగాలని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ఇక సినిమాల సంగతి చూస్తే.. విక్కీ కౌశల్‌ (Vicky Kaushal) త్వరలోనే ‘బ్యాడ్‌ న్యూజ్‌’ సినిమాతో అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా జులై 19న విడుదలవుతోంది. కట్రినా అయితే ఇప్పుడు కొత్త సినిమాలేం చేయడం లేదు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus