Katrina Kaif: అతి త్వరలో ప్రియుడు విక్కీ కౌశల్‌ తో కత్రినా కైఫ్ పెళ్ళి..!

బాలీవుడ్ బ్యూటీల ప్రేమాయణాలు లెక్కలేనన్ని ఉంటాయని అక్కడి మీడియానే కోడై కూస్తుంటుంది. అందరూ ఏమో కానీ కత్రినా కైఫ్ విషయంలో ఇది నిజమే అనిపిస్తుంది. ఆమె తెలుగు సినిమాతోనే హీరోయిన్ గా కెరీర్ ను మొదలుపెట్టింది కాబట్టి.. మొదటి నుండీ ఈమె పై మన తెలుగు ప్రేక్షకుల ఫోకస్ ఉంది. సల్మాన్ ఖాన్ తో కొన్నాళ్ళు, అటు తర్వాత రన్ బీర్ కపూర్ తో, హ్రితిక్ రోషన్ తో ఈమె ప్రేమాయణం నడిపింది. అయితే కొన్నాళ్ళ నుండీ యంగ్ హీరో విక్కీ కౌశల్ తో డేటింగ్ లో ఉంది.

చాలా వరకు వీళ్ళు పార్టీలకి, పబ్బులకి తిరిగినట్టు అనేక వార్తలు వచ్చాయి. ఇదిలా ఉండగా… త్వరలోనే వీరు వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు అనేది తాజా సమాచారం. డిసెంబరు మొదటి వారంలోవీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని…. మ్యారేజ్ వెన్యూ రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సస్ ఫోర్ట్ బర్వారా అని ఓ వార్త తెగ హల్ చల్ చేస్తుంది. అయితే కత్రినా వయస్సు 38 ఏళ్ళు కాగా విక్కీ వయస్సు 33 ఏళ్ళే. విక్కీ కంటే కత్రినా 5 ఏళ్ళు పెద్దది.

అయినప్పటికీ అలాంటి పట్టింపులు ఏమీ ఇప్పట్లో లేవు కానీ..! వీళ్ళ రిలేషన్ షిప్ గురించి వీళ్ళు ఇప్పటివరకు ఓపెన్ అయ్యింది లేదు. మరి వీరి పెళ్ళి వార్తలను ఎంత వరకు నమ్మొచ్చు అనేది పెద్ద ప్రశ్న. కత్రినా కైఫ్‌ పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో విక్కీ కౌశల్ కు ఆమెకు ఉన్న రిలేషన్‌షిప్ గురించి ప్రశ్నించగా ఆమె మాట దాటేసింది. చూద్దాం ఫైనల్ గా ఏం జరుగుతుందో..!

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus