భయపడెతూ నవ్వించడం, నవ్విస్తూ భయపెట్టడం.. సినిమాల్లో ఈ ఫార్ములాకు ఎక్కువగా విజయాలు దక్కుతుంటాయి. తెలుగులోనే కాదు, ఇతర భాషల్లోనూ ఇలాంటి సినిమాలకు మంచి విజయాలు అందుకున్నాయి. అయితే ఎక్కువగా ఇలా వచ్చిన సినిమాల్లో హీరోయిన్లే దెయ్యాలుగా కనిపించి భయపెట్టి మెప్పించారు. తాజాగా మరో సినిమా అలాంటి కాన్సెప్ట్‌తోనే వస్తోంది. ఈసారి దెయ్యం అవ్వడానికి పాత తరం పద్ధతిని వాడుకున్నారు. అదేంటి, ఆ దెయ్యం ఎవరు? దాని వెనుక కథేంటి అనేది చూడండి.
కత్రినా కైఫ్ , సిద్ధాంత్ చతుర్వేది, ఇషాన్ ఖట్టర్, జాకీష్రాఫ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ఫోన్ భూత్’. హారర్ కామెడీగా రూపొందిన ఈ సినిమాలో భూతంగా కత్రినా కైఫ్ నటించింది. గుర్మీత్ సింగ్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఫరాన్ అక్తర్ నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. శాపం కారణంగా భూతంగా మారిన కత్రినా కైఫ్ తిరిగి మోక్షం సంపాదిందిచి మామూలు మనిషి అయ్యింది అనేది సినిమా కథ.
భూతాలు అంటే బాగా ఆసక్తి చూపించే సిద్ధాంత్ చతుర్వేది, ఇషాన్ ఖట్టర్‌ను కత్రినా ఎలాంటి విన్యాసాలు చేయిస్తూ హాస్యం పండించిందో ఇందులో వినోదాత్మకంగా చూపించారు. నవంబరు 4న ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే సరైన సినిమాలు లేక ఇబ్బంది పడుతున్న బాలీవుడ్‌ను భూతంగా మారిన కత్రినా కైఫ్ ఎంతవరకు హిట్ ఇస్తుందో చూడాలి. నిజానికి ఇలాంటి సినిమాలు బాలీవుడ్‌కి కొత్త కాదు. వాటికి విజయాలు రావడమూ కొత్త కాదు.
అయితే ఇప్పుడు బాలీవుడ్ ఉన్న పరిస్థితుల్లో కంటెంట్ ఏ మాత్రం తేడాగా ఉన్నా.. సరైన విజయం అందుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ఈ అందాల భూతం ప్రయోగం ఏమవుతుందో చూడాలి. ఒకప్పటిలాగే సగటు బాలీవుడ్ సినిమాల్ని అక్కడి ప్రేక్షకులు ఓకే చేయడం లేదు. అలాగే సౌత్ ఫార్ములాను గుడ్డిగా ఫాలో అయినా ఓకే చేయడం లేదు. సో ఈ ఫలితం బాలీవుడ్‌కి ఇంకో పాఠం నేర్పే అవకాశం ఉంద.ఇ