Katrina Kaif, Vicky Kaushal: కాస్ట్లీ ఏరియాలో కత్రినా-విక్కీ కొత్తిల్లు!

బాలీవుడ్ నటి కత్రినా కైఫ్, నటుడు విక్కీ కౌశల్ చాలా ఏళ్లుగా డేటింగ్ లో ఉన్నారు. ఇప్పుడు వీరిద్దరూ పెళ్లి బంధంతో ఒక్కటి కానున్నారని సమాచారం. డిసెంబర్ లో పెళ్లి జరగబోతుందని టాక్. ఈ విషయాన్ని ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. కానీ బాలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. రాజస్థాన్ లోని సిక్స్‌ సెన్సెస్‌ ఫోర్ట్‌లో వీరి వివాహం జరగనుందంటూ కథనాలు వస్తున్నాయి. ఈ విషయాన్ని ఎంత సీక్రెట్ గా ఉంచుదామని అనుకుంటున్నా..

ఏదొక విధంగా బయటకొస్తుంది కత్రినా ఉందట. అందుకే ఇప్పటివరకు తన స్నేహితులకు కూడా ఇన్విటేషన్స్ పంపించలేదట. ఇదిలా ఉండగా విక్కీ.. తనకు కాబోయే భార్యతో కలిసి జీవించడానికి ఓ ఇల్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇద్దరూ కలిసి ఉండేందుకు వీలుగా ఓ విలాసవంతమైన ఇంటిని విక్కీ అద్దెకు తీసుకున్నట్లు తెలుస్తోంది. ముంబైలోనే అత్యంత ఖరీదైన ప్రాంతంగా చెప్పుకునే ‘జుహు’ ఏరియాలో విక్కీ ఇంటిని అద్దెకు తీసుకున్నాడట. ఐదు సంవత్సరాల పాటు అక్కడే ఉండేలా ఒప్పందం కుదుర్చుకున్నాడట.

ఈ మేరకు అడ్వాన్స్ గా రూ.1.78 కోట్లను విక్కీ చెల్లించారట. ప్రతి నెలా రూ.8 లక్షల అద్దె చెల్లించనున్నారని సమాచారం. అయితే కోహ్లీ-అనుష్క శర్మ దంపతులు కూడా ఇదే అపార్ట్మెంట్ లో ఉంటున్నారని తెలుస్తోంది.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus