బాహుబలి అంటే అందరికీ గుర్తొచ్చేది…కట్టప్ప పాత్ర….బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు…అన్న ప్రశ్నతో రెండో భాగంపై అంచనాలను పెంచాడు మన బాహుబలి దర్శకుడు జక్కన్న…అయితే ఇప్పుడు ఏ పాత్ర కోసం అయితే అందరూ ఈ సినిమా చూడాలి అని చాలా ఆతురతతో ఉన్నారో…అదే పాత్ర ఇప్పుడు కర్ణాటకలో సినిమా విడుదలకు అడ్దంకిగా మారడం రాజమౌళికి టెన్షన్ తెప్పిస్తున్న విషయం…అయితే అసలు ఏం జరిగింది అని అంటే..2008లో కావేరి జలాల వివాదంపై, సూపర్‌స్టార్ రజినీకాంత్‌పై సత్యరాజ్ ఆగ్రహపూరితమైన ప్రసంగం చేశాడు. హోగెనక్కల్ సమీకృత తాగునీటి ప్రాజెక్ట్ పునాది అంశం కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య చిచ్చు రాజేసింది. ప్రాజెక్ట్ విషయంలో కర్నాటక ప్రభుత్వ తీరుపై తమిళ నటుల సంఘం తరఫున సత్యరాజ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకోవడంతో దాదాపు 40 కోట్ల భారీ మొత్తానికి ‘బాహుబలి 2’ కర్ణాటక రైట్స్ ను కొనుకున్న బయ్యర్లు పరిస్థితి అయోమయంగా మారింది.
కన్నడ సంఘాలు తమ పట్టు వీడకపోవడంతో ‘బాహుబలి 2’ విడుదల కర్నాటకలో కష్టమయ్యే దిశలో పరిస్థుతులు చాలా క్లిష్టంగా మారాయి…అంతేకాకుండా…ఇది ఇక్కడితో ఆగిపోతుంది అని వదిలెయ్యకుండా…ఉద్యమాన్ని నిర్వహిస్తున్న కర్ణాకట రక్షణ వేదిక వాళ్ళు ‘బాహుబలి 2’ విడుదల కాబోతున్న కర్ణాటకలోని దియేటర్ల ఎదుట నిరసన కార్యక్రమాలు చేయడానికి పిలుపు ఇచ్చిన నేపధ్యంలో ‘బాహుబలి 2’ విడుదల సమస్య మరింత బిగుసుకు పోయే అవకాశం ఉంది అని అంటున్నారు. ఇక ఈ పరిస్థితులను చక్కా దిద్దేందుకు…సాక్షాత్తూ జక్కన్నే చర్చలు జరిపినా ఫలితం లేకుండా పోవడంతో…‘బాహుబలి’కి ఏ పాత్ర అయితే అంచనాలను పెంచిందో…ఇప్పుడు అదే పాత్ర సమస్యగా మారింది అని ప్రేక్షకులు ఫీల్ అవుతున్నారు… చూద్దాం ఏం జరుగుతుందో.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.