Keeravani: బింబిసార కోసం కీరవాణి తొలిసారి అలా చేశారా?

మరో 36 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో బింబిసార మూవీ రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ బాగున్నాయి. బింబిసార కళ్యాణ్ రామ్ కెరీర్ లోని బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కడంతో పాటు రికార్డ్ స్థాయి థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కానుంది.

35 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా శాటిలైట్, డిజిటల్ హక్కుల ద్వారా నిర్మాతలకు 25 కోట్ల రూపాయల ఆదాయం దక్కిందని థియేట్రికల్ హక్కుల ద్వారా 15 కోట్ల రూపాయల ఆదాయం దక్కిందని తెలుస్తోంది. బింబిసార సినిమాకు చిరంతన్ భట్ మ్యూజిక్ అందించగా కీరవాణి బీజీఎం అందించారు. కీరవాణి ఈ విధంగా ఒక సినిమాకు బీజీఎం కోసమే మాత్రమే పని చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

బింబిసార మూవీ నివురు గప్పిన నిప్పు లాంటిదని అనుకోవచ్చని కళ్యాణ్ రామ్ నటించిన అతనొక్కడే సినిమాకు తాను మ్యూజిక్ అందించాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల కుదరలేదని కీరవాణి అన్నారు. ఇప్పుడు మాత్రం నేను అతనొక్కడే చేసినట్టేనని కీరవాణి చెప్పుకొచ్చారు. బింబిసార మూవీలో హీరోగా విలన్ గా చేసింది కళ్యాణ్ రామ్ ఒక్కడేనని అందువల్లే నాకు అతనొక్కడే మూవీ చేసిన అనుభూతి కలుగుతోందని కీరవాణి పేర్కొన్నారు.

వేరేవాళ్లు మ్యూజిక్ అందిస్తే నేను బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించడం ఈ సినిమా విషయంలోనే జరిగిందని కీరవాణి చెప్పుకొచ్చారు. కీరవాణి చేసిన కామెంట్లు ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. కళ్యాణ్ రామ్ కోరుకున్న సక్సెస్ ను ఈ సినిమా అందిస్తుందో లేదో చూడాల్సి ఉంది. కేథరిన్, సంయుక్త మీనన్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించగా వీళ్లిద్దరి కెరీర్ కు కూడా ఈ సినిమా సక్సెస్ కీలకమని చెప్పవచ్చు.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus