Keeravani: ఆస్కార్ విన్నింగ్ ‘నాటు నాటు’ పాట గురించి కీరవాణి తండ్రి ఏమన్నారంటే..?

  • March 18, 2023 / 07:51 PM IST

ప్రపంచమంతా ‘ఆర్ఆర్ఆర్’ లోని ‘నాటు నాటు’ పాట ఆస్కార్ సాధించిన సంబరాల్లో ఉంటే.. ఆ సాంగ్ తనకు నచ్చలేదంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు శివ శక్తి దత్తా.. ఈయన ఎవరో కాదు.. ట్రిపులార్ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ విన్నర్ స్వరవాణి ఎం.ఎం. కీరవాణికి స్వయానా తండ్రి.. తెలుగు సినిమా, పైగా సొంత తనయుడు ఇలాంటి చరిత్ర సృష్టించే ఘనత పొందగా పుత్రోత్సాహంతో పొంగిపోవాల్సింది, ప్రశంసించాల్సిందిపోయి.. అసలు ఆ పాటలో సంగీతం ఎక్కడుంది? అని కామెంట్ చేసి షాక్ ఇచ్చారాయన..

దర్శకధీరుడు రాజమౌళి ఏళ్ల తరబడి ఊహించడానికే కష్టం అనుకున్న తెలుగు సినిమాకి, ఇండియాలోనే మొట్ట మొదటి ఆస్కార్ అవార్డ్ తెచ్చిపెట్టారు.. 95వ అకాడమీ అవార్డ్స్‌లో ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ కేటగిరీలో ‘నాటు నాటు’ ఆస్కార్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.. ఈ అరుదైైన, చరిత్రలో నిలిచిపోయే ఘనత సాధించిన కీరవాణి, చంద్రబోస్, కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్, ప్రేమ్ రక్షిత్ తదితరులకు విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు, సినీ, రాజకీయ ప్రముఖులు సామాజిక మాధ్యమాల ద్వారా విషెస్ తెలియజేస్తున్నారు..

ఈ నేపథ్యంలో కీరవాణి తండ్రి.. టాలీవుడ్ సీనియర్ లిరిక్, స్టోరీ రైటర్ శివ శక్తి దత్తా స్పందిస్తూ ఊహించని వ్యాఖ్యలు చేశారు.. ‘‘నాకు సినిమా అంటే ప్యాషన్.. మేం నలుగురం అన్నదమ్ముళం తుంగభద్రకు వలస వెళ్లి.. అక్కడ 16 సంవత్సరాల పాటు ఉన్నాం.. 300 ఎకరాలు కొని అదంతా సినిమా కోసం అమ్మేశాను.. చివరికి ఈరోజు పూట గడవడం ఎలా అనే పరిస్థితికి వచ్చాం.. ఆ సమయంలో విజయేంద్ర ప్రసాద్ (రాజమౌళి తండ్రి), నేను మంచి కథలు రాశాం..

‘కొండవీటి సింహం’, ‘జానకి రాముడు’ వంటి పలు హిట్ సినిమాలకు పని చేశాం.. అప్పటివరకు కీరవాణి, చక్రవర్తి (సంగీత దర్శకుడు) దగ్గర పనిచేస్తే వచ్చే డబ్బుతోనే ఇళ్లు గడిచేది.. కీరవాణి నా పంచ ప్రాణాలు.. తనకు మూడో ఏట నుండే సంగీతం నేర్పించాను.. తన టాలెంట్ చూసి ఎప్పుడూ ఆశ్చర్యపోతుంటాను.. కానీ ‘ఆర్ఆర్ఆర్’ లోని ‘నాటు నాటు’ పాట నాకు నచ్చలేదు.. అసలు ఇదొక పాటేనా? అందులో సంగీతమెక్కడుంది?.. విధి విచిత్రమైంది..

ఇన్నాళ్లూ తను చేసిన కృషికి ఈ రూపంలో ప్రతిఫలమొచ్చింది.. చంద్రబోస్ రాసిన 5 వేల పాటల్లో ఇది ఒక పాటా? కీరవాణి ఇచ్చిన సంగీతంలో ఇది ఒక మ్యూజిక్కేనా?.. ఏ మాటకామాట.. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ మాత్రం అద్భుతంగా ఉంది.. దీనికి తారక్ – చరణ్ చేసిన డ్యాన్స్ మహాద్భుతం.. వీళ్ల కృషికి ఆస్కార్ దక్కడం గర్వించదగ్గ విషయం’’ అన్నారు శివ శక్తి దత్తా..

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus