‘దసరా’ ని ముందుగా కీర్తి పక్కన పెట్టేసిందట.. కారణం అదే!

ఓ సినిమాని జడ్జి చేయడం మనకు మూడు గంటల పని. అది హిట్టా.. ప్లాపా అన్నది మనకు ఆ మూడు గంటల్లో క్లారిటీ వచ్చేస్తుంది. ఎందుకంటే క్లుప్తంగా చూస్తాం కాబట్టి. కానీ సినిమా వాళ్ళు కథ చెప్పినప్పుడు అది హిట్ అవుతుందా? ప్లాప్ అవుతుందా? అనే విషయాన్ని ఎలా అంచనా వేయగలరు చెప్పండి. అది చాలా కష్టమైన పని. అలాంటిది ఓ దర్శకుడు హీరోయిన్లకు కథ చెప్పాలంటే ఎంతలా ఇబ్బంది పడతారు అన్న విషయం చాలా మందికి తెలీదు.

మన తెలుగమ్మాయిలు అయితే కథ చెప్పడం ఈజీ. కానీ తెలుగు సినిమాల్లో కనిపించే హీరోయిన్లంతా దిగుమతి చేసుకున్నవారే కాబట్టి దర్శకుల తిప్పలు వర్ణనాతీతం. సరే ఇక అసలు విషయానికి వచ్చేద్దాం. ‘దసరా’ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటించింది. కానీ మొదట ఆమె ఈ ప్రాజెక్టుకి వెంటనే ఓకే చెప్పలేదట. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఆమెను కూర్చోబెట్టి 3 గంటల పాటు కథ చెప్పినా.. ఆమె సరే అని చెప్పి పంపించేసిందట.

ఎందుకంటే శ్రీకాంత్ కథని తెలంగాణ స్లాంగ్ లో చెప్పేసి వచ్చాడు. కొద్దిరోజుల తర్వాత నాని ఆమెకు ఫోన్ చేసి ఆరా తీస్తే కానీ విషయం తెలీలేదట. దీంతో ఆమెకు కథ మొత్తం ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసి చెప్పగా అప్పుడు ఆమెకు అర్ధమై ఓకే చెప్పిందట. ఈ సినిమాలో కీర్తి సురేష్… వెన్నెల అనే సింగరేణి యువతి పాత్రను పోషించింది. ఇది డీ గ్లామరస్ రోల్.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus