Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » మిస్ ఇండియా సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ ఇండియా సినిమా రివ్యూ & రేటింగ్!

  • November 4, 2020 / 10:47 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మిస్ ఇండియా సినిమా రివ్యూ & రేటింగ్!

ఇండియాలో కాఫీ డేలు చాలా ఫేమస్. అమెరికన్ కాఫీకి మనవాళ్ళు అలవాటుపడ్డారు. ఒకవేళ ఆ అమెరికన్లకు మన టీను అలవాటు చేస్తే? అదీ పురుషాధిక్య వ్యాపార సామ్రాజ్యంలో కుట్రలు, కుతంత్రాలు దాటుకుని ఓ అమ్మాయి విజేతగా నిలిస్తే? ఐడియా బావుంది కదూ! మరి, ‘మిస్ ఇండియా’ సినిమా ఎలా ఉంది?

కథ: లంబసింగిలో సాధారణ బ్యాంకు ఉద్యోగి కుటుంబంలో జన్మించిన అమ్మాయి మానస సంయుక్త (కీర్తీ సురేష్). బాల్యం నుండి వ్యాపారవేత్తగా ఎదగాలనేది తన లక్ష్యం. కుటుంబ పరిస్థితుల కారణంగా అమెరికా వెళుతుంది. కుటుంబం అండగా లేకపోయినప్పటికీ… ‘మిస్ ఇండియా’ బ్రాండ్ తో ఛాయ్ బిజినెస్ స్టార్ట్ చేస్తుంది. ఆమెకు కైలాష్ శివకుమార్ (జగపతి బాబు) అడ్డు తగులుతాడు. తన కె.ఎస్.కె. కాఫీ బ్రాండ్ వేల్యూ ‘మిస్ ఇండియా’ వల్ల పడిపోతుందని కుట్ర చేసి మానస వ్యాపారానికి భారీ నష్టం కలిగిస్తాడు. వ్యాపారంలో ఉన్నత శిఖరాలకు వెళ్లిన మానస, ఒక్కసారి కిందకు పడుతుంది. మళ్ళీ ఎలా పైకి ఎదిగింది? అసలు కైలాష్ ఏం చేశాడు? మానస ప్రయాణంలో విక్రమ్ (సుమంత్ శైలేంద్ర) పాత్ర ఏమిటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

నటీనటుల పనితీరు: కీర్తీ సురేష్ నటనకు గతంలో నేషనల్ అవార్డు వచ్చింది. ఆమె నటన గురించి కొత్తగా చెప్పేది ఏం ఉంటుంది? ‘మిస్ ఇండియా’లో మానస సంయుక్త పాత్రకు తగ్గట్టు నటించింది. పాత్రలో మానసిక సంఘర్షణను కళ్లలో పలికించింది. జగపతిబాబు స్టయిలింగ్, యాక్టింగ్, ఆ క్యారెక్టర్ రొటీన్ గా ఉన్నాయి. అయితే, సినిమాలో కీర్తీతో ఆయన సన్నివేశాలు బాగున్నాయి. ఇద్దరి మధ్య ఫేస్ టు ఫేస్ సీన్స్ క్లిక్ అయ్యాయి. కొత్తగా ఉన్నాయి. టిపికల్ మిడిల్ క్లాస్ తెలుగు మదర్ పాత్రలో నదియాను చూడటం కొత్తగా ఉంటుంది. తెలుగులో ఆమె రిచ్ క్యారెక్టర్లు ఎక్కువ చేశారు. రాజేంద్రప్రసాద్, వీకే నరేష్ పాత్రలకు తగ్గట్టు హుందాగా నటించారు. నవీన్ చంద్ర, సుమంత్ శైలేంద్ర, పూజిత, దివ్య శ్రీపాద కథను ముందుకు తీసుకువెళ్లే పాత్రల్లో నటించారు.

సాంకేతికవర్గం పనితీరు: డైరెక్టర్ నరేంద్రనాథ్ మదిలో పుట్టిన ‘మిస్ ఇండియా’ ఐడియా బాగుంది. కానీ, ఐడియా చుట్టూ అల్లిన సీన్లు, స్క్రీన్ ప్లే ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉంటే బాగుండేది. అయితే… కీర్తీ సురేష్ క్యారెక్టర్ ని బాగా రాసుకున్నారు. షీరోయిజం చూపించే ప్రతి సీన్ పేలింది. అయితే… ఫ్యామిలీ నేపథ్యంలో, బిజినెస్ వార్ నేపథ్యంలో వచ్చే కొన్ని సీన్లు మరీ ఓవర్ డ్రమాటిక్ గా ఉన్నాయి. కొన్ని డైలాగులు బాగున్నాయి. ముఖ్యంగా జగపతిబాబుతో అమ్మాయి ఏం చేస్తుందో కీర్తీ సురేష్ చెప్పే డైలాగ్ కి థియేటర్లలో అయితే మహిళా ప్రేక్షకుల నుండి క్లాప్స్ పడేవి. కొన్ని డైలాగుల్లో ప్రాస కోసం ప్రయాస పడటం బాలేదు. స్క్రీన్ ప్లే ఎలా ఉండబోతుందో, నెక్స్ట్ సీన్ ఏం జరుగుతుందో వుహించవచ్చు. రన్ టైమ్ కొంచెం ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది.

ప్రొడక్షన్ వేల్యూస్ సూపర్బ్. కాంప్రమైజ్ కాకుండా సినిమా తీశారు. సినిమాటోగ్రఫీ బాగుంది. తమన్ సంగీతం సినిమాకి మేజర్ అస్సెస్. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కొన్ని సీన్లను ఎలివేట్ చేసింది. కీర్తీ సురేష్ షీరోయిజం చూపించే సన్నివేశాలకు ఇచ్చిన రీరికార్డింగ్ సినిమాలో ఒక హైలైట్ అని చెప్పాలి.

విశ్లేషణ: మహిళలు తలుచుకుంటే సాధించలేదనిది ఏదీ లేదని సందేశం ఇచ్చే సినిమా ‘మిస్ ఇండియా’. విమెన్ ఎంపవర్‌మెంట్ గురించి గొప్పగా చెప్పారు. అయితే, రొటీన్ సీన్స్, ట్రీట్మెంట్ సినిమాకి కొంత మైనస్ గా నిలిచింది. కీర్తీ సురేష్ యాక్టింగ్, డైలాగులు, తమన్ సంగీతం కోసం రొటీన్ ని భరిస్తూ సినిమాను ఒకసారి చూడవచ్చు. రన్ టైమ్, రొటీన్ సీన్స్ ట్రిమ్ చేసి… సినిమాను క్రిస్పీగా చూపించి ఉంటే ఛాయ్ టైపులో సినిమా సూపర్ ఉండేది.

రేటింగ్: 2.5/5

ప్లాట్ ఫామ్ : నెట్‌ఫ్లిక్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #jagapathi babu
  • #keerthy suresh
  • #Miss India Movie
  • #Nadhiya
  • #Narendra Nath

Also Read

Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

Veerabhadrudu: మొదటి వీకెండ్ అద్బుతంగా కలెక్ట్ చేసిన ‘వీరభద్రుడు’.. రికవరీ ఎంతో తెలుసా?

Veerabhadrudu: మొదటి వీకెండ్ అద్బుతంగా కలెక్ట్ చేసిన ‘వీరభద్రుడు’.. రికవరీ ఎంతో తెలుసా?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

సీనియర్ నిర్మాత మృతి

సీనియర్ నిర్మాత మృతి

related news

Godari Gattupaina Review in Telugu: గోదారి గట్టుపైన సినిమా రివ్యూ & రేటింగ్!

Godari Gattupaina Review in Telugu: గోదారి గట్టుపైన సినిమా రివ్యూ & రేటింగ్!

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

trending news

Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

17 hours ago
Veerabhadrudu: మొదటి వీకెండ్ అద్బుతంగా కలెక్ట్ చేసిన ‘వీరభద్రుడు’.. రికవరీ ఎంతో తెలుసా?

Veerabhadrudu: మొదటి వీకెండ్ అద్బుతంగా కలెక్ట్ చేసిన ‘వీరభద్రుడు’.. రికవరీ ఎంతో తెలుసా?

18 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

19 hours ago
Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

21 hours ago
Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

1 day ago

latest news

Vishal: సీఎం గారూ.. మీరే ఆ పని చేయొచ్చుగా.. విజయ్‌కి విశాల్‌ సూచన

Vishal: సీఎం గారూ.. మీరే ఆ పని చేయొచ్చుగా.. విజయ్‌కి విశాల్‌ సూచన

20 hours ago
Tammareddy Bharadwaj : రాజకీయాల్లోకి ఎన్టీఆర్ వస్తాడా?.. తమ్మారెడ్డి క్లారిటీ ఇదే !

Tammareddy Bharadwaj : రాజకీయాల్లోకి ఎన్టీఆర్ వస్తాడా?.. తమ్మారెడ్డి క్లారిటీ ఇదే !

22 hours ago
Peddi: ఏ సెట్‌లో సినిమా కుదిరిందో.. ఆ సినిమానే మరపించే సినిమా..

Peddi: ఏ సెట్‌లో సినిమా కుదిరిందో.. ఆ సినిమానే మరపించే సినిమా..

1 day ago
Mega 158: వారికి గుడ్‌ డేస్‌ స్టార్ట్‌.. చిరంజీవి సినిమాకు ముహూర్తం కుదిరింది

Mega 158: వారికి గుడ్‌ డేస్‌ స్టార్ట్‌.. చిరంజీవి సినిమాకు ముహూర్తం కుదిరింది

1 day ago
Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version