Keerthy Suresh: తొలిసారి క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించిన కీర్తి సురేష్!

రామ్ కు జోడీగా ‘నేను శైలజ’ సినిమా చేసి టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది కీర్తి సురేష్. ఆ తర్వాత ‘నేను లోకల్’ వంటి బ్లాక్ బస్టర్ మూవీలో నటించినప్పటికీ.. ‘అజ్ఞాతవాసి’ వంటి బడా మూవీలో కూడా ఛాన్స్ కొట్టినప్పటికీ ఈమెకు స్టార్ డం తెచ్చిపెట్టిన మూవీ ‘మహానటి’ అనే చెప్పాలి. ఈ మలయాళీ ముద్దుగుమ్మ కొన్నాళ్ల పాటు కథా ప్రాధాన్యత కలిగిన సినిమాలనే చేస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు కమర్షియల్ సినిమాల్లోనే నటిస్తూ వస్తోంది.

ఈ ఏడాది ‘సర్కారు వారి పాట’ సినిమాతో హిట్టు కొట్టిన కీర్తి సురేష్ ప్రస్తుతం నానికి జోడీగా ‘దసరా’ వంటి బ్లాక్ బస్టర్ మూవీలో నటిస్తూ బిజీగా గడుపుతోంది. తెలుగుతో పాటు తమిళంలోనూ బిజీ హీరోయిన్ గా రాణిస్తుంది కీర్తి సురేష్. ఇదిలా ఉండగా.. తన కెరీర్లో మొదటిసారి క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించింది కీర్తి. ఆమె మాట్లాడుతూ… ” సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉందనే విషయం నాకు తెలుసు. నాతో పాటు నటిస్తున్న హీరోయిన్లు కూడా దీని గురించి నాకు చెప్పేవారు.

కానీ ఇది నా వరకు రాలేదు. కాస్టింగ్ కౌచ్ అనేది మన ప్రవర్తన పై కూడా ఆధారపడి ఉంటుందేమో. నా ప్రవర్తన బాగానే ఉంటుంది అని నేను అనుకుంటూ ఉంటాను. అందుకే ఇప్పటి వరకు నా వరకు వచ్చి ఉండకపోవచ్చు. ఒకవేళ నిజంగా నన్ను ఎవరైనా కమిట్మెంట్ అడిగితే నేను అందుకు సహకరించను అని చెప్పేస్తాను. అంతగా కుదరదు అంటే సినిమాలు మానేసి ఏదైనా జాబ్ చేసుకుంటాను,కానీ అవకాశాల కోసం కమిట్మెంట్ ఇచ్చే టైప్ అయితే నేను కాదు’ అంటూ చెప్పుకొచ్చింది కీర్తి సురేష్.

క్యాస్టింగ్ కౌచ్ గురించి ఏ స్టార్ హీరోయిన్ ను ప్రశ్నించినా.. అది మా వరకు రాలేదు అనే చెప్తున్నారు. కీర్తి సురేష్ కూడా అదే విధంగా చెప్పింది. మీడియా, సోషల్ మీడియా వంటివి అభివృద్ధి చెందడం వల్ల టాలెంట్ కలిగిన ఎంతో మంది నటీమణులకు అవకాశాలు వెతుక్కుంటూనే వస్తున్నాయి అన్నది మాత్రం వాస్తవం.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus