Keerthy Suresh: కీర్తి సురేష్.. ఇక ఫామ్లోకి వచ్చేసినట్టే..!

కీర్తి సురేష్.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరు. తమిళంలో కూడా మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ‘నేను శైలజ’ తో టాలీవుడ్ కు పరిచయమైన ఈ బ్యూటీ అటు తర్వాత ‘నేను లోకల్’ తో మరో బ్లాక్ బస్టర్ అందుకుంది. అదే టైంలో ఈమెకు పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ సినిమాలో అవకాశం వచ్చింది. కానీ ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. అటు తర్వాత ‘మహానటి’ చిత్రం ఈమెకు స్టార్ స్టేటస్ ను తెచ్చిపెట్టింది.

ఆ సినిమా ఈమె ఇమేజ్ ను 10 రెట్లు పెంచిందనే చెప్పాలి. కీర్తి సురేష్ కు భారీ పారితోషికం ఇవ్వడానికి నిర్మాతలు ముందుకు వచ్చారు. ఈ క్రమంలో కీర్తి సురేష్ చేసిన హీరోయిన్ సెంట్రిక్ సినిమాలు అన్నీ ప్లాప్ అయ్యాయి. ‘ఈమె పని అయిపోయింది’ అనే కామెంట్లు కూడా వినిపించాయి. కీర్తికి ఆఫర్లు కూడా తగ్గుతూ వచ్చాయి. ఆమె నటించిన గత చిత్రం ‘సర్కారు వారి పాట’ యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది. అలా అని ఆ సినిమాలో ఈమె నటనకు కూడా మంచి మార్కులు పడలేదు.

జస్ట్ పాటలు వచ్చినప్పుడు వచ్చి వెళ్లిపోవడం, పేకాట, మద్యం సేవించే అమ్మాయిగా కనిపించడంతో.. ట్రోల్స్ కూడా ఫేస్ చేసింది. అయితే తాజాగా వచ్చిన ‘దసరా’ సినిమా ఈమె ఇమేజ్ ను పెంచింది. ఈ మూవీలో ‘వెన్నెల’ అనే పాత్రలో చాలా బాగా నటించింది. కథను మలుపు తిప్పే పాత్ర కూడా ఇదే. కీర్తి కూడా తన నటనతో ఈ పాత్రకు జీవం పోసిందని చెప్పాలి.

అందుకే ప్రేక్షకులు కీర్తి(Keerthy Suresh) పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంటర్వెల్ కు ముందు ఈమె చేసిన మాస్ డాన్స్ కూడా .. ప్రేక్షకులతో విజిల్స్ వేయిస్తున్నాయి. మొత్తంగా కీర్తి.. ప్లాపుల నుండి బయటపడినట్టనే చెప్పాలి. ‘భోళా శంకర్’ కూడా హిట్ అయితే.. కీర్తి సురేష్ కు ఇంకా ప్లస్ అవుతుంది. ఆ చిత్రంలో ఈమె చిరంజీవికి చెల్లెలు పాత్రలో కనిపించబోతుంది.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus