Keerthy Suresh: పెళ్లి వార్తల పై స్పందించిన కీర్తి సురేష్

‘నేను శైలజ’ ‘నేను లోకల్’ వంటి సూపర్ హిట్ చిత్రాలతో టాలీవుడ్ లో తనదైన ముద్రవేసుకున్న కీర్తి సురేష్… ‘మహానటి’ తో ఓవర్నైట్ స్టార్ గా ఎదిగింది. అటు తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూనే మరోపక్క విమెన్ సెంట్రిక్ సినిమాల్లో కూడా నటిస్తూ బిజీగా గడుపుతోంది. ఈ ఏడాది ‘సర్కారు వారి పాట’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన కీర్తి.. వచ్చే ఏడాది ‘దసరా’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉండగా..

స్టార్ హీరోయిన్ల పై పెళ్లి రూమర్స్ రావడం అనేది సర్వసాధారణమైన విషయం. చాలా కాలంగా కీర్తి సురేష్ పెళ్లి గురించి కూడా అనేక వార్తలు వచ్చాయి. ఈ మధ్యన కీర్తి సురేష్ తల్లిదండ్రులు… ఆమెకు వరుడిని కూడా ఫిక్స్ చేసినట్టు ప్రచారం జరుగుతుంది. ఆమె ఎస్ చెప్పినట్టు కూడా టాక్ వినిపించింది. అయితే లేటెస్ట్ గా ఈ విషయాల పై కీర్తి సురేష్ క్లారిటీ ఇచ్చింది. ఓ ఆంగ్ల మీడియా ఈ విషయం పై కీర్తిని ఆరా తీయగా..

ఆమె ఈ విషయం పై క్లారిటీ ఇచ్చింది. తన ఇంట్లో వాళ్ళ పెళ్లి గురించి ఒత్తిడి చేస్తున్న మాట నిజమే. కానీ తనకు ఇంకా సినిమాల్లో నటించాలి అని ఉందని.! హిందీలో కూడా తనకు మంచి ఆఫర్లు వస్తున్నాయని.. ఈ విషయం తన పేరెంట్స్ కు కూడా చెప్పానని, వాళ్ళు కూడా అర్థం చేసుకుని తనకు సహకరించినట్టు ఆమె తెలిపిందట. కాబట్టి.. కీర్తి పెళ్లి వార్తలకు ఫుల్స్టాప్ పెట్టినట్టు అయ్యింది.

అయితే కీర్తి సురేష్ వయసు ఇప్పుడు 30 సంవత్సరాలు కావడం గమనార్హం.ఇదిలా ఉండగా.. కీర్తి సురేష్ నిర్మాతగా మారి సినిమాలు చేయడానికి కూడా రెడీ అయినట్టు ప్రచారం జరిగింది. ఈ వార్తల్లో కూడా నిజం లేదు అని ఆమె తేల్చిచెప్పేసిందట.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus