పెళ్లి చేసుకున్న తర్వాత హీరోయిన్స్ కెరీర్ ఎందుకో ఆశాజనకంగా ఉండవు. పెళ్లికి ముందు మైంటైన్ చేయగలిగిన స్టార్ డమ్ లేదా రిస్క్ చేసే ధైర్యం కాస్త తగ్గుతాయి. అందువల్ల పెళ్లయ్యాక సినిమాలు చేయడం అనేది మొత్తానికి మానేస్తారు లేదా చేసే సినిమాల జోనర్లు మారిపోతాయి. ఆఖరికి సమంతకి (Samantha) కూడా తప్పలేదు. ఇప్పుడు కీర్తి సురేష్ (Keerthy Suresh) పరిస్థితి కూడా అలానే తయారయ్యింది. తన చిన్ననాటి స్నేహితుడిని పెళ్లాడిన కీర్తి సురేష్, పెళ్లి తర్వాత రకరకాల సినిమాలు సైన్ చేసింది అంటూ వార్తలు వచ్చాయి కానీ ఎందులోనూ నిజం లేదని తర్వాత తెలిసింది.
అయితే.. పెళ్లి అనంతరం కీర్తి సురేష్ సైన్ చేసిన మొట్టమొదటి సినిమా ఓ బాలీవుడ్ ప్రాజెక్ట్ అని తెలుస్తోంది. బాలీవుడ్ లో ప్రస్తుతం నటుడిగా మంచి ఫామ్ లో ఉన్న రాజ్ కుమార్ రావు హీరోగా రూపొందనున్న ఓ రీజనల్ డ్రామా ఫిలిం సైన్ చేసింది కీర్తి సురేష్. ఈ తరహా చిత్రాల్లో ఎక్స్ పోజింగ్ కానీ ఇబ్బందికరమైన డ్యాన్సులు కానీ ఉండవు. సో, కీర్తి సురేష్ కూడా పెళ్లి తర్వాత తన పంథా మార్చిందనే అనుకోవాలి.
ఇకపోతే.. కీర్తి సురేష్ తెలుగులోనూ కొన్ని సినిమాలు సైన్ చేయడానికి సిద్ధమవుతోంది. ఆమె నటించిన “ఉప్పు కర్పూరంబు” అనే అమెజాన్ ప్రైమ్ వెబ్ సిరీస్ కూడా ఈ ఏడాది చివర్లో విడుదలకానుంది. సుహాస్ (Suhas) ప్రధాన పాత్ర పోషించిన ఈ సిరీస్ మంచి కామెడీ ఎంటర్టైనర్ గా ఉండబోతోందని వినికిడి. అదే విధంగా కీర్తి సురేష్ కొన్ని ఉమెన్ సెంట్రిక్ సినిమాలు సైన్ చేసే ప్లాన్ లో ఉందట. మరి కీర్తి సురేష్ కెరీర్ ఇక ముందు ఎలా ఉంటుందో చూద్దాం.