Keerthy Suresh: ‘దసరా’ సెట్స్‌లో ఆఖరి రోజున ఏం జరిగిందంటే… కీర్తి బంగారమే!

‘వెన్నెల’గా త్వరగా తెలుగు తెర మీద అదరగొట్టడానికి సిద్ధమవుతోంది కీర్తి సురేశ్‌. ఆమె కథానాయికగా నటించిన ‘దసరా’ సినిమా గురించే మేం చెబుతున్నది. ఈ సినిమా పాన్‌ ఇండియా లెవల్‌లో రిలీజ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా గురించి చాలా రకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. అయితే ఈసారి అది హీరో గురించి కాదు, హీరోయిన్‌ గురించి. అవును కీర్తి సురేశ్‌ గురించే ఇప్పుడు చర్చ. ఎందుకంటే ఆమె ఓ హీరోయిక్‌ పని చేసింది కాబట్టి.

సినిమా షూటింగ్‌ పూర్తయినప్పుడో, లేక సినిమా భారీ విజయాన్ని అందుకున్నప్పుడో ఆ సినిమా టీమ్‌కి హీరోలు గిఫ్ట్‌లు ఇవ్వడం చూస్తుంటాం. తొలుత కోలీవుడ్‌లో మొదలైన ఈ సంప్రదాయం ఆ తర్వాత టాలీవుడ్‌కి కూడా వచ్చింది. ఎవరు ముందు స్టార్ట్‌ చేశారు అనే విషయం అయితే తెలియదు కానీ.. అక్కడి నుండే మన దగ్గరకు వచ్చింది. సినిమా షూటింగ్‌ సమయంలో టీమ్‌తో ఏర్పడ్డ అనుబంధంతో.. సినిమా అయిపోయాక వాళ్లకు గిఫ్ట్‌లు ఇవ్వడం స్టార్ట్‌ చేశారు. తాజాగా ఈ పనిని కీర్తి సురేశ్‌ చేసింది అని చెబుతున్నారు.

మాస్‌ అవతారంలో నాని కనిపించనున్న చిత్రం‘దసరా’. ఈ సినిమాలో కీర్తి సురేశ్‌ వెన్నెల అనే గ్రామీణ యువతి పాత్ర పోషిస్తోంది. ఆ పాత్ర కోసం ఆమె చాలానే కష్టపడిందని సమాచారం. డీగ్లామర్‌ రోల్‌ కావడం, యాక్టింగ్‌కి ప్రాధాన్యత ఉన్న కావడం వల్ల చాలానే కష్టపడాల్సి వచ్చింది అంటున్నారు. దాంతోపాటు సినిమా టీమ్‌తో బాగా అటాచ్‌ అయిపోయిందట. దీంతో సినిమా షూటింగ్ కంప్లీట్‌ అయ్యాక సెట్‌లో పని చేసిన వారందరికీ గోల్డ్‌ కాయిన్స్‌ పంచిపెట్టిందట కీర్తి సురేశ్‌.

మొత్తం 130 మంది సినిమా టీమ్‌ బంగారు నాణెలను కీర్తి గిఫ్ట్‌గా ఇచ్చినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. మా ‘మహానటి’ బంగారం అంటూ ఆమె ఫ్యాన్స్‌ తెగ సంబరపడిపోతున్నారు. ఇటీవల కాలంలో టాలీవుడ్‌లో ఇలాంటి పని చేసిన వారు అంటే.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షూటింగ్‌ పూర్తయ్యాక రామ్‌ చరణ్‌ టీమ్‌కి బంగారు నాణెలను బహుమతిగా ఇచ్చాడు. ‘పుష్ప’ సమయంలో అల్లు అర్జున్‌ కూడా ఖరీదైన బహుమతులు అందించాడు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus