యష్ హీరోగా శ్రీనిథి శెట్టి హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 1’. 2018 వ సంవత్సరం డిసెంబర్ 21న ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం రికార్డుల మోత మోగించింది. కన్నడ చిత్రాలకి అక్కడ తప్ప వేరే భాషల్లో పెద్దగా ఆదరణ ఉండదు. ఎందుకంటే.. అక్కడ ఎక్కువ రీమేక్ చిత్రాలే రూపొందుతుంటాయి కాబట్టి. అయితే ‘కె.జి.ఎఫ్’ ఆ ముద్రని చెరిపేసిందనే చెప్పాలి. ‘బాహుబలి’ తర్వాత పాన్ ఇండియా లెవెల్లో విజయం సాధించిన ఏకైక చిత్రంగా ‘కె.జి.ఎఫ్ చాప్టర్1’ నిలిచింది.
ఈ చిత్రంలో హీరోకి ఇచ్చే ఎలివేషన్స్ ప్రతీ ఒక్కరికీ గూజ్ బంప్స్ తెప్పించే విధంగా ఉంటాయి. ఈ చిత్రం విజయం సాధించడంతో త్వరలో రాబోతున్న ‘కె.జి.ఎఫ్2’ పై కూడా భారీ అంచనాలు నమోదయ్యాయి. దర్శకుడు ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా డైరెక్టర్ అనే క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం అతను ప్రభాస్ తో ‘సలార్’, ఎన్టీఆర్ తో ఒక చిత్రాన్ని రూపొందిస్తూ బిజీగా గడుపుతున్నాడు. నేటితో కె.జి.ఎఫ్ విడుదలై 3ఏళ్ళు పూర్తికావస్తోంది.
మరి తెలుగులో ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :
నైజాం
4.75 cr
సీడెడ్
2.30 cr
ఉత్తరాంధ్ర
1.46 cr
ఈస్ట్
1.72 cr
వెస్ట్
0.60 cr
గుంటూరు
0.91 cr
కృష్ణా
1.13 cr
నెల్లూరు
0.31 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
12.18 cr
‘కె.జి.ఎఫ్ చాప్టర్1’ కి తెలుగు థియేట్రికల్ బిజినెస్ రూ.4.7 కోట్ల వరకు జరిగింది. ఓ కన్నడ చిత్రానికి ఇంత బిజినెస్ జరగడం పై అంతా షాక్ కు గురయ్యారు. అయితే ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.12.18 కోట్ల షేర్ ను రాబట్టి.. బయ్యర్స్ కు డబుల్ ప్రాఫిట్స్ ను అందించింది.