అది వర్కౌట్ అయితే ‘దసరా’ నిర్మాతల పంటపండినట్టే!

నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన బిగ్ బడ్జెట్ మూవీ ‘దసరా’ మార్చి 30న పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా నాని గ్యాప్ లేకుండా అన్ని రాష్ట్రాలు తిరుగుతూ ‘దసరా’ సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీని శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. ఇతను సుకుమార్ శిష్యుడు. అందుకే గురువు స్టైల్ లోనే ‘దసరా’ కంప్లీట్ రా అండ్ రస్టిక్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దాడు.

నాని అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా మాస్ అవతార్ లో కనిపిస్తున్నాడు. రెండు పాటలకు మంచి స్పందన లభించింది. హీరో నాని ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందనే కాన్ఫిడెన్స్ ను వ్యక్తం చేస్తున్నాడు. కానీ ఈ సినిమాను నిర్మించిన నిర్మాతలు ఒక్కటంటే ఒక్క హిట్టు కూడా లేకపోవడం.. అలాగే ఈ సినిమాకి వారు ఏకంగా రూ.75 కోట్ల బడ్జెట్ పెట్టేయడం కొంత కలవర పెట్టే అంశం.

అయితే ‘దసరా’ తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను ఇక్కడ దిల్ రాజు కొనుగోలు చేశారు. కేవలం తెలుగు రాష్ట్రాల హక్కులనే ఆయన రూ.35 కోట్లు పెట్టి కొనుగోలు చేశారు. అలాగే కర్ణాటక రైట్స్ ను ‘కె.జి.ఎఫ్’ నిర్మాతలు ఫ్యాన్సీ రేటు చెల్లించి కొనుగోలు చేయడానికి పోటీ పడుతున్నారట. అయితే వారికి పోటీగా ఇంకో సంస్థ ఉంది.

డీల్ ఇంకా ఫైనల్ కాలేదు కానీ… ‘కె.జి.ఎఫ్’ నిర్మాతలు ‘దసరా’ హక్కులను కొనుగోలు చేయడానికి ముందుకు రావడం అనేది సినిమా సూపర్ హిట్ కాబోతుంది అనే విషయాన్ని సూచిస్తున్నట్లు అంతా భావిస్తున్నారు. ఏదైతేనేం ‘దసరా’ హిట్ అయితే నిర్మాతల పంటపండినట్టే..!

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus