‘కె.జి.ఎఫ్ చాప్టర్ 1’ పాన్ ఇండియా లెవెల్లో విడుదల అవుతుంది అన్నప్పుడు చాలా నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి. కన్నడ సినిమాల్ని ఆ స్థాయిలో ఎవరు చూస్తారు. నిర్మాతలకు చేతులు కాలడం గ్యారెంటీ అని విమర్శించిన వారు సైతం లేకపోలేదు. కానీ కట్ చేస్తే ఈ మూవీ భారీ బ్లాక్ బస్టర్ అయ్యింది. ప్రతి ఏరియాలో రెండింతలు లాభాలను అందించిన ఘనత సాధించింది. కొన్ని సెంటర్లలో అయితే 50 రోజులు కూడా ఆడింది. మాస్ ప్రేక్షకులు ఈ మూవీని బాగా ఓన్ చేసుకున్నారు.
ఇప్పుడు ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ కి అంతకు మించి బ్రహ్మరథం పట్టారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఏప్రిల్ 14న రిలీజ్ అయ్యి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.అయితే షూటింగ్ దశలో ఉండగానే ఈ మూవీకి భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. సినిమాకి హిట్ టాక్ లభించింది కాబట్టి.. ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్ళను రాబట్టి సూపర్ హిట్ లిస్ట్ లో స్థానం సంపాదించుకుంది.
ఒకసారి వాటి వివరాలను గమనిస్తే :
ఏపి + తెలంగాణ
76.75 cr
కర్ణాటక
84.17 cr
తమిళనాడు
36.49 cr
కేరళ
24.17 cr
హిందీ
172.05 cr
ఓవర్సీస్
79.40 cr
టోటల్ వరల్డ్ వైడ్
473.03 cr కోట్లు(షేర్)
థియేట్రికల్ బిజినెస్
ఏపి + తెలంగాణ
74.00 cr
కర్ణాటక
100.00 cr
తమిళనాడు
35.00 cr
కేరళ
10.00 cr
హిందీ
100.00 cr
ఓవర్సీస్
30.00 cr
టోటల్ వరల్డ్ వైడ్
350 cr కోట్లు
2 వారాలు పూర్తయ్యేసరికి ఈ మూవీ రూ.473.03 కోట్ల షేర్ ను రాబట్టింది.ఓవర్సీస్ ,కేరళ, తెలంగాణ, హిందీలో,తమిళ్ లో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించి లాభాలను అందించింది. కర్ణాటకలో,ఆంధ్ర లో ఈ మూవీ ఇంకా బ్రేక్ ఈవెన్ కాలేదు. ఓవరాల్ గా అయితే ‘కె.జి.ఎఫ్ 2’ బ్రేక్ ఈవెన్ సాధించి రూ.123.03(కరెక్టెడ్) కోట్ల లాభాలను అందించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.