Sudeep, Darshan: పునీత్ ఉంటే సపోర్ట్ చేస్తాడా..? హీరో సుదీప్ పోస్ట్!

కన్నడ హీరో దర్శన్ పై ఆదివారం నాడు దాడి జరిగింది. ఆయన హీరోగా నటించిన ‘క్రాంతి’ సినిమా వచ్చే ఏడాది జనవరి 26న విడుదల కానుంది. దాని ప్రమోషన్స్ కోసం కర్ణాటకలోని హోస్‌పేటలో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఓ సాంగ్ ను విడుదల చేశారు. వేదికపై హీరోయిన్ మాట్లాడుతుండగా.. క్రౌడ్ లో నుంచి ఒకరు హీరో దర్శన్ ను టార్గెట్ చేసి చెప్పు విసిరారు. అది దర్శన్ కి గట్టిగానే తగిలింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అసలు దర్శన్ పై దాడి చేయడానికి కారణమేంటంటే.. ఇటీవల ఓ వీడియో ఇంటర్వ్యూలో అదృష్ట లక్ష్మిపై దర్శన్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అదృష్ట దేవత ఎప్పుడూ తలుపు తట్టదని, ఆమె తలుపు తట్టినప్పుడు చెయ్యి పట్టుకుని లాగాలని, బెడ్ రూమ్‌లోకి లాగి వివస్త్రను చేయాలని, లేదంటే బయటకు వెళ్లిపోతుందని దర్శన్ అన్నారు. ఈ మాటలు హిందువుల మనోభావాలను కించపరిచేలా ఉండడంతో అందరూ ఫైర్ అవుతున్నారు. మరికొందరు మహిళలపై దాడులు చేసే వాళ్లను ప్రేరేపించే విధంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు.

దీనికి నిరసనగా దర్శన్ పై దాడికి పాల్పడ్డారని సమాచారం. దర్శన్.. దివంగత పునీత్ రాజ్ కుమార్ అభిమానిగా చెప్పుకుంటారు. అయితే చాలా ఏళ్లుగా దర్శన్, పునీత్ అభిమానుల మధ్య వైరం జరుగుతోంది. సోషల్ మీడియాలో ఇద్దరు హీరోల అభిమానుల మధ్య గొడవలు బాగా జరిగేవి. ఇప్పుడు పునీత్ అభిమానిగా చెప్పుకునే వ్యక్తి చేసిన దాడి వల్ల గొడవ కొత్త మలుపు తీసుకుంది. ఈ దాడిని పునీత్ అన్నయ్య శివరాజ్ కుమార్ ఖండించారు.

మన కుటుంబంలో వ్యక్తికి ఈ విధంగా జరగడం బాధాకరమని.. ప్రతి ఒక్కరూ మానవత్వంతో వ్యవహరించాలని.. ద్వేషాన్ని కాదు.. ప్రేమని పంచండి అంటూ చెప్పుకొచ్చారు. హీరో సుదీప్ కూడా ఈ ఇన్సిడెంట్ పై రియాక్ట్ అయ్యారు. దర్శన్ పై దాడి జరగడం తనను బాగా డిస్టర్బ్ చేసిందని.. పునీత్ అభిమానులకు, దర్శన్‌కు మధ్య పరిస్థితులు అంత బాలేదన్న సంగతి తనకు తెలుసని అన్నారు. పునీత్ బ్రతికుంటే ఇలాంటివి సపోర్ట్ చేసేవాడా..? అంటూ ప్రశ్నించారు.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus