రవితేజ (Ravi Teja) ,ఇలియానా (Ileana D’Cruz) జంటగా ‘ఖతర్నాక్’ (Khatarnak) తర్వాత వచ్చిన చిత్రం ‘కిక్’ (Kick). స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి (Surender Reddy) తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ‘ఆర్.ఆర్’ మూవీ మేకర్స్ పై ఆర్.ఆర్.వెంకట్ (R. R. Venkat) నిర్మించారు. ‘నేనింతే’ (Neninthe) వంటి ప్లాప్ తర్వాత రవితేజ.. ‘అతిథి’ (Athidhi) వంటి ప్లాప్ తర్వాత సురేందర్ రెడ్డి.. కలిసి చేసిన మూవీ ఇది. దీంతో మొదట్లో ఈ సినిమా పై అంచనాలు లేవు. కానీ 2009 సమ్మర్ కానుకగా మే 8న రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.
సమ్మర్ సీజన్ ని ఫుల్ గా వాడుకుని బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ బస్టర్ గా నిలిచింది. ఒకసారి ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 7.53 cr |
సీడెడ్ | 2.72 cr |
ఉత్తరాంధ్ర | 3.21 cr |
ఈస్ట్ | 0.94 cr |
వెస్ట్ | 0.92 cr |
గుంటూరు | 1.70 cr |
కృష్ణా | 1.03 cr |
నెల్లూరు | 0.84 cr |
ఏపీ+తెలంగాణ(టోటల్) | 18.89 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 3.86 cr |
టోటల్ వరల్డ్ వైడ్ | 22.75 cr |
‘కిక్’ చిత్రం రూ.13.77 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఆ టైంలో రవితేజకి అంత మార్కెట్ కూడా లేదు. కానీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఫుల్ రన్ ముగిసే సరికి రూ.22.75 కోట్ల షేర్ ను రాబట్టి ట్రేడ్ కి సైతం షాకిచ్చింది. బయ్యర్లకు 8.95 కోట్ల లాభాలు అందించడమే కాకుండా.. 2009 కి గాను ‘మగథీర’ (Magadheera) , ‘అరుంధతి’ (Arundhati).. ల తర్వాత హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.