Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » “దిల్ రూబా” న్యూ ఏజ్ కమర్షియల్ సినిమా, యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ బాగా ఇష్టపడతారు – హీరో కిరణ్ అబ్బవరం

“దిల్ రూబా” న్యూ ఏజ్ కమర్షియల్ సినిమా, యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ బాగా ఇష్టపడతారు – హీరో కిరణ్ అబ్బవరం

  • March 11, 2025 / 02:13 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

“దిల్ రూబా” న్యూ ఏజ్ కమర్షియల్ సినిమా, యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ బాగా ఇష్టపడతారు –  హీరో కిరణ్ అబ్బవరం

“క” సినిమా సూపర్ హిట్ తర్వాత సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న మూవీ “దిల్ రూబా”. ఈ సినిమాలో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తోంది. “దిల్ రూబా” చిత్రాన్ని శివమ్ సెల్యులాయిడ్స్, ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తమ నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు. న్యూ ఏజ్ కమర్షియల్ మూవీగా ఈ నెల 14న హోలీ పండుగ సందర్భంగా ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఇప్పటికే సాంగ్స్, టీజర్, ట్రైలర్ తో హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకున్న “దిల్ రూబా” అన్ని వర్గాల ప్రేక్షకుల దృష్టినీ ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలో మూవీ హైలైట్స్ ను లేటెస్ట్ ఇంటర్వ్యూలో వెల్లడించారు హీరో కిరణ్ అబ్బవరం.

– “దిల్ రూబా” సినిమా నిన్న ఫైనల్ గా చూసుకున్నాం. మూవీ ఔట్ పుట్ చూశాక చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్, ట్రైలర్ అందరికీ బాగా రీచ్ అయ్యింది. ఈ సినిమా వుమెన్ రెస్పెక్ట్ ఫీలయ్యేలా ఉంటుంది. మిగతా వారితో పాటు ఫీమేల్ ఆడియెన్స్ “దిల్ రూబా”ను బాగా ఇష్టపడతారు. 2గంటల 20నిమిషాల మూవీలో ఎక్కడా బోర్ ఫీల్ అవ్వరు. థియేటర్స్ నుంచి బయటకు వచ్చేప్పుడు ఒక మంచి మూవీ చూశామనే భావిస్తారు. “క” కంటే ముందు చేసిన సినిమా కదా ఇందులో కొత్తగా ఏదీ ఉండకపోవచ్చు అనుకుంటారు కానీ 10 టు 20 పర్సెంట్ సీన్స్ ఎక్కడైనా చూసినట్లు అనిపించినా మిగతా మూవీ మొత్తం న్యూ ఏజ్ కమర్షియల్ దారిలో వెళ్తూ ఆకట్టుకుంటుంది.

– “దిల్ రూబా”లో ఏదో ఉంటుందని ఎక్స్ పెక్ట్ చేయొద్దనే మేము ముందే ప్రెస్ మీట్స్ లో కథ రివీల్ చేశాం. లవ్ లోని మ్యాజిక్ మూవ్ మెంట్స్ ను ఎంజాయ్ చేస్తారు. హీరో క్యారెక్టరైజేషన్ బాగుంటుంది. మనం సారీ, థ్యాంక్స్ ఎలా పడితే అలా చెప్పేస్తుంటాం. కానీ హీరోకు అలా చెప్పడం నచ్చదు. సారీ, థ్యాంక్స్ మాటలకు ఒక విలువ ఉందనేది అతని వెర్షన్. ఎక్స్ లవర్ ప్రెజెంట్ లవర్స్ ను కలపడం కొత్తగా ఉంటుంది. ఇప్పటిదాకా మన సినిమాల్లో ఎక్స్ లవర్ వల్ల గొడవలు జరగడం, కామెడీగా చూపించడం జరిగింది. కానీ “దిల్ రూబా”లో ఎక్స్ లవర్ తో కూడా ఒక స్నేహాన్ని షేర్ చేసుకోవచ్చు, మోరల్ సపోర్ట్ ఇవ్వొచ్చనే మంచి పాయింట్ ను మా మూవీలో చూస్తారు. “క” సినిమా సక్సెస్ తర్వాత “దిల్ రూబా”లో మేము ఎంతవరకు ఏమేం ఛేంజెస్ చేసి బెస్ట్ ఔట్ పుట్ ఇవ్వగలమో అక్కడి వరకు మార్చాం.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'ఛావా'.. తెలుగులో కూడా పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్..!
  • 2 'జై భీమ్' రేంజ్ కంటెంట్ తో వస్తున్న 'కోర్ట్'!
  • 3 పోసానికి బిగ్ రిలీఫ్... కానీ..?

– “దిల్ రూబా” సిద్ధు క్యారెక్టరైజేషన్ హైలైట్ గా ఉంటుంది. ఆ క్యారెక్టర్ ఎమోషనల్ డ్రైవ్ లో మూవీ సాగుతుంది. పూరి జగన్నాథ్ గారి సినిమాల్లో హీరోలు క్యారెక్టరైజేషన్స్ లా ఇందులో హీరో సిద్ధు నమ్మే సిద్దాంతం, అతను చెప్పే మాటలు ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయి. హీరో సారీ, థ్యాంక్స్ ఎందుకు చెప్పడు, అతని ఫ్యామిలీలో జరిగిన ప్లాష్ బ్యాక్ ఏంటి అనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సినిమా చేసేప్పుడు నేను కూడా కొంత మారాను. ఊరికే సారీ, థ్యాంక్స్ చెప్పి ఆ మాటల విలువ తీయొద్దు అనుకున్నాను. మనిషి మోసం చేసినప్పటి నుంచే దేవుడు అతనితో మాట్లాడటం మానేశాడు, తప్పు చేయని ప్రతివాడూ హీరోనే, కానీ చేసిన తప్పు తెలుసుకున్నవాడు ఇంకా పెద్ద హీరో లాంటి హీరో చెప్పే డైలాగ్స్ హిట్టింగ్ గా ఉంటాయి. అన్ని ఎలిమెంట్స్ తో మూవీ అంతా ప్యాకేజ్ లా ఉంటుంది.

– “దిల్ రూబా”కు యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ బాగా కనెక్ట్ అవుతారు. ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఇబ్బందిపెట్టే ఒక్క మాట, ఒక్క సీన్ కూడా మూవీలో ఉండదు. నేను చేసిన సిద్ధు క్యారెక్టరైజేషన్ మీకు కంప్లీట్ గా నచ్చుతుంది. నేను ఇలాంటి హై క్యారెక్టర్ చేయలేదు. గతంలో నేను చేసిన చిత్రాల్లో సెటిల్డ్ పర్ ఫార్మెన్స్ చూశారు. ఈ చిత్రంలో నేను కొత్తగా కనిపిస్తా. ఎక్కువ రివీల్ చేయొద్దని ట్రైలర్ లో కొన్ని సీన్స్ కట్ చేయలేదు. థియేటర్ లో మూవీ చాలా ఇంటెన్స్ గా ఉంటుంది.

– మేము మూడేళ్ల క్రితమే ఈ సినిమా మొదలుపెట్టాం. అప్పటికి డ్రాగన్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు బిగిన్ కాలేదు. అయితే మా కంటే ముందు ఆ మూవీస్ రిలీజ్ అయ్యాయి. ఆ చిత్రాలతో మా దిల్ రూబాకు ఎలాంటి పోలిక ఉండదు. ఫ్రెష్ అప్రోచ్ లో మా మూవీ వెళ్తుంటుంది. తమిళ సినిమా కాస్త బాగున్నా ఇక్కడ ప్రమోషన్ చేసి రిలీజ్ చేస్తున్నారు. మన ఆడియెన్స్ ఆదరిస్తున్నారు. కానీ మనకు తమిళనాట అంత స్కోప్ ఉండటం లేదు. మనం ఆదరించినట్లు వాళ్ల దగ్గర మన సినిమాల ఆదరణ పొందడం లేదు.

– సినిమా నా పేరు మీద థియేటర్స్ లోకి వస్తుంది కాబట్టి నేను మూవీ మేకింగ్ లో ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వాలో అక్కడివరకు అవుతాను. హీరోగా అది నా బాధ్యతగా భావిస్తా. ఈ ఇయర్ నావి రెండు చిత్రాలు వస్తాయి. నెక్ట్స్ ఇయర్ నుంచి ఏడాదికి మూడు సినిమాలు కనీసం రిలీజ్ చేసుకునేలా ప్లాన్ చేస్తా. దిల్ రూబా తర్వాత వెంటనే కె ర్యాంప్ మూవీ ఉంటుంది.

– గతంలో కొన్ని మూవీస్ మొహమాటానికి చేసినవి ఉన్నాయి. కానీ ఆ తప్పులకు రిగ్రెట్ కావడం లేదు. ఇకపై మంచి మూవీస్ సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తా. క సినిమా తర్వాత ప్రేక్షకులు నన్ను చూసే తీరు మారింది. మంచి సినిమా చేయాలని కష్టపడుతున్నాడు అనే పాజిటివ్ ఒపీనియన్ నాపై మొదలైంది. దాన్ని కాపాడుకుంటూ జర్నీ చేస్తా. ప్రస్తుతం నాలుగు చిత్రాలు చేస్తున్నా. ఈ నాలుగు చిత్రాలు వేటికవి పూర్తిగా భిన్నమైనవి. ఒకటి కల్ట్ లవ్ స్టోరీ, మరొకటి యూత్ ఫుల్ ఎంటర్ టైనర్. ఇంకోటి ఫ్యామిలీ డ్రామా, నాలుగోది లంకె బిందెల వేట నేపథ్యంలో ఉంటుంది. ఈ సబ్జెక్ట్ చాలా పెద్దది. 3 పార్ట్ మూవీగా తీస్తున్నాం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dilruba
  • #Kiran Abbavaram

Also Read

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

Drishyam 3 Collections: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ‘దృశ్యం 3’

Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

Swayambhu: ‘స్వయంభూ’ ఓటీటీ… ఇది కొంత రిలీఫే.. కానీ?

Swayambhu: ‘స్వయంభూ’ ఓటీటీ… ఇది కొంత రిలీఫే.. కానీ?

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

related news

trending news

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

58 mins ago
Drishyam 3 Collections: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ‘దృశ్యం 3’

1 hour ago
Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

2 hours ago
ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

3 hours ago
Swayambhu: ‘స్వయంభూ’ ఓటీటీ… ఇది కొంత రిలీఫే.. కానీ?

Swayambhu: ‘స్వయంభూ’ ఓటీటీ… ఇది కొంత రిలీఫే.. కానీ?

4 hours ago

latest news

Mythri Movie Makers: ‘మైత్రి…’ వెనకడుగు.. ఇక నుండీ ఆ ప్రాజెక్టులకి దూరం

Mythri Movie Makers: ‘మైత్రి…’ వెనకడుగు.. ఇక నుండీ ఆ ప్రాజెక్టులకి దూరం

1 day ago
Koratala Siva: పాదఘట్టం, ఎర్రసముద్రాలను పక్కన పెట్టేసిన కొరటాల

Koratala Siva: పాదఘట్టం, ఎర్రసముద్రాలను పక్కన పెట్టేసిన కొరటాల

1 day ago
Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ చిత్రానికి 11 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ చిత్రానికి 11 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago
Peddi: రూ.10 కోట్ల నష్టంతో రిలీజ్ అవుతున్న ‘పెద్ది’

Peddi: రూ.10 కోట్ల నష్టంతో రిలీజ్ అవుతున్న ‘పెద్ది’

1 day ago
Blast Zone Collections: సూపర్ హిట్ టాక్.. అయినప్పటికీ నిరాశపరిచిన ‘బ్లాస్ట్ జోన్’ మూవీ వసూళ్ళు

Blast Zone Collections: సూపర్ హిట్ టాక్.. అయినప్పటికీ నిరాశపరిచిన ‘బ్లాస్ట్ జోన్’ మూవీ వసూళ్ళు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version