Kiran Abbavaram: సోషల్ మీడియా నెగెటివిటీపై యంగ్ హీరో కామెంట్స్!

‘రాజావారు రాణిగారు’ సినిమాతో టాలీవుడ్ కి హీరోగా పరిచయమయ్యారు కిరణ్ అబ్బవరం. ఆ తరువాత ‘ఎస్ఆర్ కల్యాణ మండపం’ సినిమాతో కమర్షియల్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు ఆయన అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందిన ‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమాతో ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. దీంతో సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటున్నారు ఈ యంగ్ హీరో. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై స్పందించారు.

మూడేళ్లలో కేవలం ఐదు సినిమాలు చేసిన తనలాంటి చిన్న హీరోపై ఇంత నెగిటివిటీ ఎందుకు వస్తుందో అర్థం కావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఏ సినిమా షూటింగ్ లో అయినా.. లైట్ మ్యాన్ దగ్గర నుంచి అందరినీ అన్న అని పిలుస్తానని.. అలాంటిది తనకు యాటిట్యూడ్ ఎక్కువ అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. తాను ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి రాలేదని.. ఇక్కడ ఒక వ్యవస్థ ఉంటుందని..

దాన్ని ఎలా ఫాలో అవ్వాలి వంటి విషయాలు తనకు తెలియదని కిరణ్ వెల్లడించారు. ఇదే సమయంలో సోషల్ మీడియాలో వస్తోన్న నెగెటివిటీ గురించి స్పందించారు. మూడేళ్లలో ఐదు సినిమాలు మాత్రమే చేశానని.. అలాంటిది తనపై ఇంత నెగెటివిటీను స్ప్రెడ్ చేస్తున్నారంటే.. దానిపై రియాక్ట్ అయ్యేవారు ఎవరూ లేరని అన్నారు. ఈ అబ్బాయి గురించి ఎందుకు ఇంత బ్యాడ్ గా మాట్లాడుతున్నారని.. ఒక్క రియాక్షన్ కూడా చూడలేదని అన్నారు.

ఆ సపోర్ట్ కోసం ఎదురుచూశానని.. నాలుగు నెలల పాటు సోషల్ మీడియాలో కూడా లేనని అన్నారు. కానీ సోషల్ మీడియాలో తన సినిమాను ప్రచారం చేసుకోవడం తన బాధ్యత అని చెప్పారు. ప్రతి ఒక్క సినిమాకి ఒక ప్రొడక్షన్ టీమ్ ఉంటుందని.. వాళ్లు ప్రమోషన్స్ చేస్తుంటారని.. అదే తన సినిమాకి కూడా జరుగుతుందని అన్నారు. కానీ తననే ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్ధం కావడం లేదని చెప్పుకొచ్చారు.

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus