‘రాక్షసుడు’ వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran), బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas ) కాంబినేషన్లో వస్తున్న సినిమా ‘కిష్కింధపురి’ (Kishkindhapuri). హారర్ థ్రిల్లర్ జోనర్లో ఈ సినిమా రూపొందుతుంది. ‘చావు కబురు చల్లగా’ ఫేమ్ కౌశిక్ పెగళ్ళపాటి డైరెక్ట్ చేసిన మూవీ ఇది. ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్ పై సాహు గారపాటి (Sahu Garapati) ఈ సినిమాను నిర్మించాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ ని వదిలారు. ఈ గ్లింప్స్ విషయానికి వస్తే.. ఇది 1:14 నిమిషాల నిడివి కలిగి ఉంది.
ఓ పాడుబడ్డ బంగ్లా అందులోకి వెళ్తున్న హీరో అండ్ టీం. ఈ టీంలో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కూడా ఉంది. వాళ్ళు డోర్ తీసుకుని లోపలికి వెళ్ళిన వెంటనే.. డోర్లు క్లోజ్ అయ్యాయి. తర్వాత లైట్లు పేలిపోవడం, బయట గేట్లు కూడా కొట్టుకుపోవడం వంటి ఎఫెక్టులు హారర్ ఫీలింగ్ కలిగించాయి. ఆ తర్వాత అక్కడ హీరో, హీరోయిన్ అండ్ టీంకి వచ్చిన సమస్యలు. ఆ ఊరి బ్యాక్ గ్రౌండ్.. అక్కడ చోటు చేసుకుంటున్న వింత సంఘటనలు వంటివి చూపించారు.
మొత్తంగా ఈ గ్లింప్స్ ‘కిష్కింధపురి’ వరల్డ్ బిల్డింగ్ ని చూపించారు. చివర్లో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ దెయ్యంలా మారడం షాక్ ఇచ్చే ఎలిమెంట్. సామ్ సి ఎస్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గ్లింప్స్ కి హైలెట్ గా నిలిచింది. సినిమాపై క్యూరియాసిటీ బిల్డ్ చేసే విధంగా ‘కిష్కింధపురి’ గ్లింప్స్ ఉందని చెప్పవచ్చు. లేట్ చేయకుండా మీరు కూడా ఓ లుక్కేయండి :