ప్రపంచ సినిమాలో ‘ఇన్‌సెప్షన్’కి గొప్పే పేరు ఉంది. ఆ సినిమా గురించి ఇప్పటికీ గొప్ప చెప్పుకుంటూ ఉంటారు. సినిమా ప్రేమికులు, సినిమా జనాలు ఆ సినిమాను ఓ పాఠంలా చూస్తారు అని అంటారు. ఇక తెలుగు సినిమాలో మాస్ సినిమా, కౌబాయ్ సినిమాలకు ఓ ఉదాహరణగా పేరు తెచ్చుకున్న సినిమాల్లో ‘కొదమసింహం’ ఒకటి. ప్రముఖ కథానాయకుడు చిరంజీవి హీరోగా నటించిన ఈ సినిమను కె.మురళీ మోహన్ రావు తెరకెక్కించారు. ఈ సినిమా ఈ రోజు ఈ రోజు (నవంబర్ 21)న ప్రేక్షకుల ముందుగా రీరిలీజ్‌గా వచ్చింది.
అంతా ఓకే కానీ ఈ సినిమా గురించి చెప్పేటప్పుడు ‘ఇన్‌సెప్షన్’ సినిమా గురించి ఎందుకు ప్రస్తావించారు అనే డౌట్ మీకు వచ్చిందా? ఉంది కారణం ఉంది. ఆ కారణం కూడా చిరంజీవి చెప్పిందే. ‘కొదమసింహం’ సినిమాలో ‘స్టార్ స్టార్..’ పాటకు ఆ హాలీవుడ్ సినిమాకు లింక్ ఉందట. ‘కొదమం సింహం’ సినిమాలో ఆ పాట అప్పట్లో వింత. చిరంజీవి నేల మీద నుంచి నడుస్తూ గోడపై నుంచి 360 డిగ్రీలు నడిచి మళ్లీ నేల మీదకి వచ్చేలా ఓ సీన్ ఉంటుంది. మీరు చూసే ఉంటారు.

‘జపం జపం జపం కొంగ జపం..’ పాట చిరంజీవికి ఫేవరేట్ సాంగ్. ప్రభుదేవా కొరియోగ్రఫీలో రూపొందిన ఆ పాటలో ఫ్లోర్ నుంచి గోడపైకి స్టెప్స్ వేస్తూ మళ్లీ ఫ్లోర్ మీదకు వచ్చే డ్యాన్స్ మూవ్ మెంట్ ఉంటుంది. ఒకే షాట్‌లో ఆ స్టెప్ తెరకెక్కించారు. దీన్ని ఎలా చేశారని అప్పట్లో అందరూ సర్‌ప్రైజ్ అయ్యారు. మెట్లున్న ఒక వీల్‌కు కెమెరా పెట్టి తీశారా పాట. ఆ టెక్నాలజీ, కాన్సెప్ట్ తరహాలోనే ‘ఇన్‌సెప్షన్’ సినిమాలో కొన్ని సన్నివేశాలు తెరకెక్కించారు అని కూడా చెప్పారు.
ఆగస్టు 9, 1990న ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘కొదమసింహం’ సినిమాను 4కే కన్వర్షన్, 5.1 డిజిటల్ సౌండింగ్‌తో రీరిలీజ్ చేశారు. మరి రీరిలీజ్‌లో ఈ సినిమా ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.
