రాజమౌళి (S. S. Rajamouli) హవా టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా వరకూ విస్తరించడంతో, ఆయన సృష్టించిన రికార్డులను అధిగమించాలనే ప్రయత్నాలు మొదలయ్యాయి. ప్రత్యేకించి కోలీవుడ్ డైరెక్టర్స్ ఈ విషయంలో మరింత ఉత్సాహంగా ఉన్నారు. ఈ క్రమంలో అట్లీ (Atlee) పేరుతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘జవాన్’ (Jawan) వంటి భారీ విజయాన్ని అందుకున్న అట్లీ తన తదుపరి ప్రాజెక్ట్‌ను పాన్ వరల్డ్ లెవల్లో చేయడానికి సిద్ధమవుతున్నాడని కోలీవుడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అట్లీ తాజా ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన రాకపోయినా, ఇందులో స్టార్ క్యాస్టింగ్ ఉండబోతుందని టాక్.
ముఖ్యంగా హాలీవుడ్ టెక్నిషియన్స్, హై ఎండ్ విజువల్ ఎఫెక్ట్స్‌తో ఈ సినిమా రూపుదిద్దుకోబోతుందట. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి, టాలీవుడ్ నుంచి యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) లేదా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) పేరు వినిపిస్తోంది. కానీ, వారు ఇప్పటికే తమ ప్రాజెక్ట్‌లలో బిజీగా ఉండటంతో, అట్లీ తన స్క్రిప్ట్‌కు సరిపోయే మరో స్టార్ హీరో కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది. ‘జవాన్’తో అట్లీ బాక్సాఫీస్ దగ్గర 1200 కోట్ల వసూళ్లు సాధించినప్పటికీ, బాహుబలి 2 (Baahubali 2) వంటి డొమెస్టిక్ రికార్డులను అందుకోలేకపోయాడు.
ఇప్పుడు, తన నెక్స్ట్ సినిమాతో ఆయన రాజమౌళి రికార్డులను దాటాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో కథనంతో పాటు విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు గ్లోబల్ ఆడియెన్స్‌ను టార్గెట్ చేస్తాయట. ఈ ప్రయత్నాలు ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. అవసరమైతే ఈ ప్రాజెక్ట్ కోసం అట్లీ తన టైమ్ తీసుకుంటాడని చెబుతున్నారు.
‘జవాన్’ తర్వాత రజనీకాంత్ (Rajinikanth), విజయ్ (Vijay Thalapathy) వంటి స్టార్స్‌తో అట్లీ సినిమా చేసే అవకాశాలు ఉన్నా, ఇప్పుడు అతను ఆలోచనలను విస్తరించి, పాన్ వరల్డ్ లెవల్లో ఓ ప్రత్యేకమైన సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడట. ఇది నేరుగా రాజమౌళి స్టాండర్డ్స్‌ను టచ్ చేయాలనే ఆలోచనగా భావిస్తున్నారు. ఇదే సమయంలో రాజమౌళి మహేష్ బాబుతో (Mahesh Babu) భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ రూపొందిస్తున్నారు. ఈ సినిమా పూర్తి గ్లోబల్ టోన్‌లో ఉండబోతోంది. ఈ నేపథ్యంలో, అట్లీ (Atlee) ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయన్నదే చూడాలి.