టాలీవుడ్‌లో వైవిధ్యమైన పాత్రలు, సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రానా దగ్గుబాటి (Rana Daggubati) తాజాగా వెండి తెరపై ఎక్కువగా కనిపించకపోవడం అభిమానులకు నిరాశ కలిగిస్తోంది. ‘విరాటపర్వం’ (Virata Parvam)తర్వాత ఆయన నుంచి సొలో ప్రాజెక్ట్ రావడం లేదు. రెండు సంవత్సరాలుగా రానా పూర్తిస్థాయి పాత్రలో నటించిన చిత్రం ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఇటీవలే రజనీకాంత్ (Rajinikanth) నటించిన ‘వేట్టయ్యన్’ (Vettaiyan) సినిమాలో కీలక పాత్రలో మెరిసినా, అది రానా స్థాయికి సరిపడే పాత్ర కాదు. ఇదిలా ఉండగా, రానా సోషల్ మీడియాలో మాత్రం హల్చల్ చేస్తూ, తన ప్రత్యేకమైన హోస్టింగ్ స్టైల్‌తో అందరినీ ఆకట్టుకుంటున్నాడు.
Rana Daggubati
కొత్తగా విడుదలైన సినిమాల టీమ్‌లను ఇంటర్వ్యూ చేస్తూ, వారి సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. కానీ అదే సమయంలో, రానా నటుడిగా తన తదుపరి ప్రాజెక్ట్‌పై ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడం అభిమానుల్లో ఆతృతను పెంచుతోంది. ‘హిరణ్యకశిప’ ప్రాజెక్ట్ ఒకప్పుడు భారీ అంచనాలను సొంతం చేసుకున్నా, ఆ సినిమా మొదలుకాకుండానే పక్కనబడ్డట్లు సమాచారం.
అతని కెరీర్‌లో ‘ఘాజీ’ (Ghazi) , ‘బాహుబలి’ (Baahubali) వంటి ప్రాజెక్ట్‌లు తన నటనకు గౌరవాన్ని తెచ్చిపెట్టినా, ఇప్పటి పరిస్థితుల్లో గ్యాప్ మరీ ఎక్కువైపోయినట్లు అనిపిస్తోంది. ఈ గ్యాప్ మరింత పొడిగిస్తే రానా మార్కెట్‌పై ప్రభావం చూపొచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. అభిమానులు ఈ ఏడాదిలోనైనా కొత్త ప్రాజెక్ట్ గురించి అప్డేట్ ఇవ్వాలని ఆశిస్తున్నారు. ఒక వైపు రానా స్క్రీన్ మీద కనిపించకపోయినా, అతని హోస్టింగ్, సోషల్ మీడియాలో వ్యక్తిత్వం మాత్రం హైలైట్ అవుతోంది.
అయితే, ఇది ఎంతకాలం అభిమానుల అంచనాలను సమకూర్చగలదో అనుమానమే. రానా నుంచి ఒక భారీ, వైవిధ్యమైన కథనంతో కూడిన సినిమా రావాలని అందరూ కోరుకుంటున్నారు. మరి రానా తన తీరును మార్చుకుని త్వరలోనే కొత్త ప్రాజెక్ట్ ప్రకటిస్తాడా? లేదా మరికొంత కాలం వెయిట్ చేస్తాడా అనేది చూడాలి.