తమ ప్రాంతానికి, భాషకు చెందిన కళాకారులను ఆదరించడం కామన్. పక్క వారిని తమవారిగా గౌరవించడం తెలుగు వారికే సొంతం. అందుకే తమిళంలో నిర్మితమైన సినిమాలు తెలుగులో అనువాదమై స్ట్రైట్ చిత్రంగా విజయం సాధించాయి. అక్కడి స్టార్స్ కి ఇక్కడ కూడా వీరాభిమానులు ఏర్పడ్డారు. అలా తెలుగు వారి అభిమానాన్ని చూరగొన్న తమిళ స్టార్స్ పై ఫోకస్..
రజనీకాంత్ తమిళ ప్రజలకు దేవుడు రజనీకాంత్. ఆయన చిత్రం వస్తే పండుగ వచ్చినట్లే. సూపర్ స్టార్ కి తెలుగులోనూ అదే ఫాలోయింగ్ ఉంది. అంతులేని కథ సినిమాలో అద్భుతమైన నటనతో తెలుగువారి మనసుదోచుకొని.. అప్పటి నుంచి విజయాలను సొంతం చేసుకుంటున్నారు. రజనీ నటించిన దళపతి, ముత్తు, భాషా, అరుణాచలం , నరసింహ, చంద్రముఖి, రోబో వంటి సినిమాలు కలక్షన్ల వర్షం కురిపించాయి.
కమలహాసన్ బాల్యంలోనే సినిమాలో అడుగుపెట్టిన కమలహాసన్ హీరోగా నటించిన తొలి నాళ్లలోనే అయన సినిమాలు తెలుగులోకి వచ్చేవి. మరో చరిత్ర మూవీతో తమిళం, తెలుగులో ఒకే సారి స్టార్ హీరోగా గుర్తింపు సాధించుకున్నారు. ఆకలి రాజ్యం, సాగర సంగమం, స్వాతి ముత్యం, నాయకుడు , విచిత్ర సోదరులు, భారతీయుడు, మైఖేల్ మదన కామ రాజు, విశ్వరూపం వంటి సినిమాలు తెలుగులోనూ బ్లాక్ బస్టర్ గా నిలిచాయి.
అజిత్ ఉత్తమ ప్రేమ కథ చిత్రం ప్రేమలేఖ సినిమాతో తమిళ స్టార్ అజిత్ తెలుగు వారికి దగ్గరయ్యారు. అప్పటి నుంచి ఆయన సినిమాలకు తెలుగులోనూ క్రేజ్ పెరిగింది. ఆశ ఆశ ఆశ, వాలి, ప్రియురాలు పిలిచింది, గ్యాంబ్లర్ సినిమాలో ఇక్కడ మంచి ఓపెనింగ్స్ రాబట్టాయి.
విక్రమ్నటుల్లో విక్రమ్ స్టైల్ వేరు. కమర్షియల్ సినిమాలు చేస్తూనే.. కథా బలమున్న పాత్రల్లో కనిపించడానికి ఇష్టపడుతారు. ఆలా ఆయన శివపుత్రుడు సినిమాలో నట విశ్వరూపం చూపించారు. ఇందుకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అప్పటి నుంచి అతని సినిమా అంటే ఎగబడి చూస్తుంటారు. అపరిచితుడు, నాన్న సినిమాలు ఇక్కడ సూపర్ హిట్ అయ్యాయి.
సూర్య తెలుగు స్టార్స్ తో సమానంగా తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్ క్లబ్ లు ఉన్న తమిళ నటుడు సూర్య. అతని నటనతో పాటు అందంతో అమ్మాయిల హృదయాలను గెలుచుకున్నారు. గజనితో దూసుకొచ్చిన ఈ హీరో సూర్య సన్నాఫ్ కృష్ణన్, రక్త చరిత్ర, యముడు, సింగం 2 , 24 సినిమాలతో తెలుగు హీరోగా ముద్రపడిపోయారు.
విశాల్తెలుగు కుటుంబానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ కోలీవుడ్ హీరోగా విశాల్ పరిచయమయ్యారు. ఆయన నటించిన ప్రతి సినిమా తెలుగులో అనువాదమై రిలీజ్ అవుతుంది. విశాల్ కి తెలుగులో గుర్తింపును తీసుకొచ్చిన సినిమా పందెం కోడి. ఆ తర్వాత సెల్యూట్, పిస్తా, భరణి చిత్రాలతో హిట్లు కొట్టి మార్కెట్ పెంచుకున్నారు.
కార్తీ హీరో సూర్యకి తమ్ముడు అయిన కార్తీ విభిన్న కథలను ఎంచుకొని తనకంటూ ఓ స్టార్ డమ్ తెచ్చుకున్నారు. ఆయన నటించిన ఆవారా తెలుగు యువతను ఆకట్టుకుంది. అనంతరం వచ్చిన ‘యుగానికి ఒక్కడు’, ‘నా పేరు శివ ’ బహాయీ వసూళ్లు రాబట్టాయి. రీసెంట్ గా వచ్చిన కాష్మోరా తెలుగు కలక్షన్స్ ట్రేడ్ వర్గాల వారిని ఆశ్చర్యపరిచింది.
ధనుష్ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్న ధనుష్ కొంత ఆలస్యంగానే తెలుగు వారికి చేరువయ్యారని చెప్పాలి. 2002 ల్లోనే హీరోగా ఎంట్రీ ఇచ్చిన ధనుష్ 2014 లో వచ్చిన రఘువరన్ బీటెక్ మూవీతో తెలుగు స్టార్ క్రేజ్ సొంతం చేసుకున్నారు.
జీవా యువనటుడు జీవా కూడా తెలుగు యువహీరోలు జాబితాలో స్థానం సంపాదించుకున్నారు. ఆయనకు రంగం మూవీ ఆ ఇమేజ్ ని తెచ్చి పెట్టింది. ఆ తర్వాత జీవా చేసే ప్రతి సినిమా తెలుగులో అనువాదమై మంచి కలక్షన్స్ సాధిస్తోంది.