Kona Venkat, Chiranjeevi: చిరంజీవిపై కోన వెంకట్ కామెంట్లు వింటే షాకవ్వాల్సిందే!

సినిమా రంగంలో బ్యాగ్రౌండ్ లేకుండా ఎదగాలని భావించే ప్రతి ఒక్కరూ చిరంజీవిని స్పూర్తిగా తీసుకుంటారనే సంగతి తెలిసిందే. తాజాగా ప్రముఖ టాలీవుడ్ రచయితలలో ఒకరైన కోన వెంకట్ చిరంజీవిని పొగుడుతూ సోషల్ మీడియాలో కామెంట్లు చేయగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి. కోన వెంకట్ తన పోస్ట్ లో లైఫ్ అనేది సముద్రంలాంటిదని పేర్కొన్నారు. ఈత వచ్చి లోతుల్లోకి వెళ్లే వాళ్లకు మాత్రమే ముత్యాలు దొరుకుతాయని ఆయన చెప్పుకొచ్చారు.

వల వెయ్యడం తెలిసినవాడికి చేపలు దొరుకుతాయని ఒడ్డున నిలబడితే కాళ్లు మాత్రమే తడుస్తాయని కోన వెంకట్ పేర్కొన్నారు. అటువంటి సముద్రపు లోతులు చూసి సముద్రాన్ని శాసించే స్థాయికి వెళ్లిన వాడే మెగాస్టార్.. మా వాల్తేరు వీరయ్య అని కోన వెంకట్ చెప్పుకొచ్చారు. చిరంజీవిది శాసించే స్థాయి అని ఆయన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వాల్తేరు వీరయ్య సక్సెస్ సాధించడం కోన వెంకట్ కు కూడా కీలకమనే సంగతి తెలిసిందే.

ఈ మధ్య కాలంలో కోన వెంకట్ కెరీర్ కూడా ఆశాజనకంగా లేదు. మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీలో నటించిన సినిమాలలో ఖైదీ నంబర్ 150 మినహా మిగతా సినిమాలేవీ మరీ భారీగా సక్సెస్ సాధించలేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. కొన్ని సినిమాలు సక్సెస్ అయినా కమర్షియల్ గా హిట్ అనిపించుకోలేదు. వాల్తేరు వీరయ్య సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బాగుండటంతో వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ అవుతుందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ మధ్య కాలంలో చిరంజీవి కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించడం లేదు. చిరంజీవి సినిమాలకు సంబంధించి వేగం పెంచాలని కొంతమంది చేస్తున్న కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus