జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం పొలిటికల్ ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే. ఏపీ ఎన్నికల్లో జనసేన కేవలం 21 స్థానాలలో మాత్రమే పోటీ చేస్తున్నా పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాలలో పోటీ చేస్తుండటంతో ఫలితాలు అనుకూలంగా వస్తాయని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. అయితే పవన్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత పొలిటికల్ గా కొంతమంది నుంచి విమర్శలు ఎదురయ్యాయి. గీతాంజలి మళ్లీ వచ్చింది (Geethanjali Malli Vachindhi) ప్రమోషన్స్ లో భాగంగా కోన వెంకట్ (Kona Venkat) పవన్ కళ్యాణ్ సెన్సిటివ్ అని ఇంట్రావర్ట్ అని చెప్పుకొచ్చారు.
నీకెందుకు రాజకీయాలు అని పవన్ కళ్యాణ్ కు నేను సలహా ఇచ్చానని కోన వెంకట్ కామెంట్లు చేశారు. ఎవడు పడితే వాడు మాటలు అంటున్నాడని నీకు అవసరమా అని పవన్ తో చెప్పానని ఆయన తెలిపారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ నీ ఒపీనియన్ నీ దగ్గరే పెట్టుకో అన్నారని కోన వెంకట్ చెప్పుకొచ్చారు. మరోవైపు గీతాంజలి సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన గీతాంజలి మళ్లీ వచ్చింది బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.
2 గంటల 24 నిమిషాల నిడివితో ఈ సినిమా విడుదలవుతోంది. ఏఎంబీ సినిమాస్ లో ఈ సినిమాకు బుకింగ్స్ బాగానే ఉండగా మిగతా థియేటర్లలో బుకింగ్స్ పుంజుకోవాల్సి ఉంది. శివ తుర్లపాటి డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం. కామెడీ హారర్ జానర్ లో తెరకెక్కిన గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమాకు టాక్ కీలకం కానుంది.
ఈ సినిమా హిట్టైతే తెలుగులో అంజలికి మరిన్ని సినిమా ఆఫర్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీ ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కిందని తెలుస్తోంది. ఈ సినిమా ట్రైలర్ కు మిక్స్డ్ రెస్పాన్స్ రాగా సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఈ సినిమా సక్సెస్ సాధిస్తే కామెడీ హారర్ జానర్ లో మరిన్ని సినిమాలు వచ్చే ఛాన్స్ ఉంది.