టాలీవుడ్ పెద్ద దిక్కు మెగాస్టార్ చిరంజీవి ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో ఎప్పుడూ ముందుంటారు. ఈ కోవిడ్ సమయంలో కూడా ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలను చేపట్టారు. దీంతో ఆయన సేవలను సర్వత్రా ప్రసంశలు దక్కుతున్నాయి. ఈ క్రమంలో ఆయన గొప్పతనాన్ని తెలియజేస్తూ ‘చిరు సంజీవని’ అనే పేరుతో స్పెషల్ సాంగ్ ను రిలీజ్ చేశారు సంగీత దర్శకుడు, గాయకుడు చరణ్ అర్జున్. ఈ పాటను ట్విట్టర్ ద్వారా షేర్ చేసిన సినీ రచయిత, నిర్మాత కోన వెంకట్..
చిరుని ఉద్దేశిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ”సాయం విలువ పొందినవాడికే తెలుస్తుంది..నేత్రదానం, రక్తదానం, కష్ట కాలంలో ఆహారం దానం, నేడు ప్రాణవాయువు దానం, మరెన్నో గుప్తదానాలు గుట్టుగా చేసుకుంటూ పోతున్న అన్నయ్య ఎప్పటికీ చిరంజీవే” అంటూ రాసుకొచ్చారు. దీంతో ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చక్కటి లిరిక్స్ తో రూపొందించిన ఈ పాటను చరణ్ అర్జున్, నాగదుర్గ ఆలపించారు. చిరు సేవలను కొనియాడుతూ..
ఆయన ఎదుర్కొన్న సవాళ్లను వివరిస్తూ రాసుకున్న ఈ పాట మెగాభిమానులను ఆకట్టుకుంటుంది. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం చిరు ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్నారు. మరికొన్ని రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పునః ప్రారంభం కానుంది.
సాయం విలువ పొందినవాడికే తెలుస్తుంది..
నేత్రదానం, రక్తదానం, కష్ట కాలంలో ఆహారం దానం, నేడు ప్రాణవాయువు దానం, మరెన్నో గుప్తదానాలు గుట్టుగా చేసుకుంటూ పోతున్న అన్నయ్య ఎప్పటికీ చిరంజీవే 🙏