కొన్ని నెలల క్రితం నాగార్జున ఫ్యామిలీ మీద తెలంగాణ మంత్రి సమంత విషయంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే. ఇదే విషయం లో నాగార్జున కోర్టులో సుమారు 100 కోట్ల పరువు నష్టం దావా వేసాడు. కోర్ట్ వాయిదాలకు తన కుమారుడు అక్కినేని నాగ చైతన్య తో కలిసి హాజరు అవుతూ ఉండటం కూడా చూశాం. అయితే ఇది ఇలా నడుస్తుండగా , నిన్న అర్థరాత్రి 12 గంటల సమయంలో మినిస్టర్ కొండా సురేఖ “X “(ట్విట్టర్) వేదికగా ఒక ట్వీట్ చేసారు.
Konda Surekha, Nagarjuna
“Nagarjuna గారికి సంబంధించి నేను చేసిన వ్యాఖ్యలు నాగార్జున గారు లేదా ఆయన కుటుంబ సభ్యులను బాధపెట్టే ఉద్దేశంతో చేసినవి కావని నేను స్పష్టం చేయదలిచాను. అక్కినేని నాగార్జున గారు లేదా ఆయన కుటుంబ సభ్యుల గౌరవాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశం నాకు అసలు లేదు. వారిని ఉద్దేశించి నా వ్యాఖ్యల ద్వారా ఏదైనా అనవసరమైన భావన కలిగిందని అనిపిస్తే దానికి నేను చింతిస్తున్నాను.
అలాంటి వ్యాఖ్యలను నేను ఉపసంహరించుకుంటున్నాను.” అని ట్వీట్ చేసారు. దీనిపై నాగార్జున మరియు అయన అభిమానులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి..? ఇది ఇలా ఉండగా , 1990 లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో , అక్కినేని నాగార్జున హీరోగా అమల హీరోయిన్ గా తెరకెక్కిన ట్రెండ్ సెట్టింగ్ మూవీ. అప్పట్లో ఈ మూవీ ఒక సంచలనం. 36 ఏళ్ళ తరువాత రీ రిలీజ్ కి 4కే డాల్బీ atmos రీ రికార్డింగ్ సౌండ్ తో నవంబర్ 14న గ్రాండ్ గా రిలీజ్ కి సిద్ధమయ్యారు.