అల్లు అర్జున్‌తో సినిమా అనుకొని ఆ తర్వాత క్యాన్సిల్ అయ్యి… తారక్‌తో సినిమా ఓకే చేసుకున్నారు కొరటాల శివ. ఇది ఒక పాయింట్. కొత్త సినిమాలో తారక్ యంగ్ పొలిటిషియన్‌గా కనిపిస్తాడు అని టాక్ వచ్చింది. ఇది రెండో పాయింట్. కొరటాల – తారక్ సినిమాలో రీసెంట్ పొలిటికల్ హీట్‌ను సినిమాలో చూపిస్తారని టాక్. ఇది మూడో పాయింట్. ఈ మూడింటిని కలిపేసి… రకరకాలుగా వార్తలొండేస్తున్నారు కొంతమంది. దీనిపై కొరటాల తాజాగా క్లారిటీ ఇచ్చారు.
ఎన్టీఆర్‌తో తీయబోయే సినిమా గురించి కొరటాల శివ ఇటీవల మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో సినిమా కథ ఎలా ఉండొచ్చు, కాన్సెప్ట్ ఏంటి అనే విషయాలపై చిన్న క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన చెప్పినదాని బట్టి చూస్తే ఈ సినిమాలో పాలిటిక్స్ అనే ఆలోచనే లేదని తెలుస్తోంది. అంతేకాదు ఇప్పటివరకు తారక్‌ను చూడని పాత్రలో చూపిస్తా అని కూడా చెప్పారు కొరటాల. తారక్‌తో చేయబోయే సినిమా నా కెరీర్‌లోనే రాసిన అతి పెద్ద కథ అని కొరటాల శివ చెప్పుకొచ్చారు.
భారీ ఎమోషన్స్, డిఫరెంట్ బ్యాక్‌డ్రాప్‌లో కథను సిద్ధం చేసుకున్నానని కూడా కొరటాల చెప్పారు. అంతేకానీ పుకార్లు వస్తున్నట్లు ఈ సినిమా పొలిటికల్ డ్రామా కాదని క్లారిటీ ఇచ్చేశారు కొరటాల. అయితే ఆ ఎమోషన్స్ ఏంటి, బ్యాక్‌డ్రాప్ ఏంటి అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు పడుతుంది. అంతేకాదు ‘జనతా గ్యారేజ్’ చేసే టైం లోనే తారక్‌కి ఈ పాయింట్ చెప్పానని కొరటాల తెలిపారు. మొన్నీ మధ్య ఓ ఇంటర్వ్యూలో తారక్ సినిమా పాన్ ఇండియా ఆలోచన ఏమైనా ఉందా? అంటే కూడా ఇలాంటి మాటలే చెప్పారు కొరటాల.
పాన్ ఇండియా అనే పదమే తనకు నచ్చదని, పెద్ద కథ రాస్తే దాన్ని మొత్తం దేశం చూస్తుంది అని తనదైన శైలిలో చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ కథ భారీగా ఉంటుందని చెప్పారు. ఆ లెక్కన చెప్పకనే పాన్ ఇండియా ఎలిమెంట్స్ రెడీ చేశారు అని అనుకోవచ్చేమో. ‘ఆచార్య’ విడుదలయ్యాక ఈ సినిమా పని మొదలుపెడతారు కొరటాల. జూన్‌లో షూటింగ్ ఉండొచ్చు.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!