యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఎన్టీఆర్30 సినిమా పూజా కార్యక్రమాలు ఈరోజే జరిగాయి. ఈ నెల 29వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలుకానుంది. రాజమౌళి, ప్రశాంత్ నీల్ ఈ సినిమా పూజా కార్యక్రమానికి గెస్ట్ లుగా హాజరయ్యారు. ఈ సినిమా గురించి కొరటాల శివ మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు. ఎన్టీఆర్30 బ్యాక్ డ్రాప్ గురించి ఆయన చెప్పుకొచ్చారు. ఈ జనరేషన్ లో ఉన్న గొప్ప నటులలో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ తో మళ్లీ కలిసి పని చేయడం సంతోషంగా భావిస్తున్నానని కొరటాల శివ తెలిపారు.
జనతా గ్యారేజ్ తర్వాత నా సోదరుడితో కలిసి పని చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని ఆయన చెప్పుకొచ్చారు. విస్మరణకు గురైన ఒక తీర ప్రాంత బ్యాక్ డ్రాప్ కు సంబంధించిన కథతో ఈ సినిమా తెరకెక్కుతోందని కొరటాల శివ వెల్లడించారు. ఈ సినిమా కథలో మనుషుల కంటే మృగాళ్లు ఎక్కువగా ఉంటాయని భయం అంటే వాళ్లకు తెలియదని వాళ్లకు దేవుడంటే భయం లేదని చావు అంటే భయం లేదని కానీ వాళ్లకు ఒకే ఒక్కటంటే భయమని ఆ భయం ఏంటో మీకే తెలిసి ఉంటుందని కొరటాల శివ చెప్పేశారు.
తన స్పీచ్ తో కొరటాల శివ ఈ సినిమాపై అంచనాలను పెంచేశారు. తన కెరీర్ లో ఈ సినిమా బెస్ట్ అవుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. భయం ఉండాలని భయం అవసరమని భయపెట్టడానికి ప్రధాన పాత్ర ఏ స్థాయికి వెళ్తుందనేది ఈ సినిమాలో కీలకమని ఆయన కామెంట్లు చేశారు.
ఈ సినిమా కథ విన్న వెంటనే ఫైర్ తో రాశారు సార్ అని అనిరుధ్ అన్నానని కొరటాల పేర్కొన్నారు. ఈ సినిమా మరో ఆచార్య కాదని కొరటాల శివ చెప్పకనే చెప్పేశారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఏ రేంజ్ రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది.
హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!
తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?