టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మరోసారి విడుదల తేదీల పై కన్ఫ్యూజన్ అయితే గట్టిగానే కొనసాగుతోంది. పెద్ద సినిమాలు ఒకేసారి ఫెస్టివల్స్ ను టార్గెట్ చేయడం తో కొన్ని చిన్న సినిమాలకు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు తప్పేలా లేవని క్లారిటీ వచ్చేసింది. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ కేవలం చిన్న సినిమాలకు మాత్రమే కాకుండా పెద్ద సినిమాలకు కూడా రిస్క్ అని చెప్పాలి. అయితే వీలైనంత వరకు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ లేకుండా చూసుకోవాలి అని కొందరు ఆలోచిస్తున్నారు. ఇటీవల దర్శకుడు కొరటాల శివ, పవన్ కళ్యాణ్ నిర్మాతలతో చర్చలు జరిపినట్లు ఒక టాక్ అయితే వైరల్ అవుతోంది
ఎందుకంటే ఆచార్య సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని అనుకుంటున్నారట. అదే అదే సమయానికి పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ కూడా రాబోతోంది. అందుకే ఆ సినిమా ప్రొడక్షన్ హౌస్ సితార ఎంటర్ టైన్ మెంట్స్ తో కొరటాల చర్చలు జరుపుతున్నారని టాక్. భీమ్లా నాయక్ నిర్మాత నాగ వంశీ బాక్సాఫీస్ వద్ద పోటీ కి ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. మరో వైపు మహేష్ బాబు సర్కారు వారి పాట, ప్రభాస్ రాధే శ్యామ్ సినిమాలు పోటీగా ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ రానా మీద నమ్మకంతో సంక్రాంతి బరిలో నిలుస్తున్నారు.
అయితే ఆ సినిమా సెట్ చేసుకున్న తేదీ కోసం కొరటాల శివ సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మాతలు నాగ వంశీ తో చర్చలు జరుపుతున్నారు.పవన్ కళ్యాణ్ సినిమాను కొన్ని రోజులు వాయిదా వేసుకుంటే బెటర్ అని కూడా మాట్లాడారట. ఈ విషయంలో మెగాస్టార్ పెద్దగా జోక్యం చేసుకోవడం లేదని అయితే టాక్ వినిపిస్తోంది. అయితే సహనిర్మాతగా రామ్ చరణ్ ఉన్నాడు కాబట్టి రిలీజ్ విషయంలో తప్పకుండా చర్చలు జరిపే ఛాన్స్ ఉంటుంది. మరి ఎవరి నిర్ణయం ఎలా ఉంటుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.