ఎన్టీఆర్ (Jr NTR) ‘RRR’ (RRR) సినిమాతో పాన్-ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించాడు. ఈ చిత్రంలో అతని నటనకు హాలీవుడ్ దర్శకులు సైతం ఫిదా అయ్యారు, కొందరు తనతో సినిమా చేయడానికి ఆసక్తి చూపారు. ఈ క్రేజ్ నడుమ ‘దేవర: పార్ట్ 1’ గత ఏడాది సెప్టెంబర్ 27న విడుదలైంది. కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ డ్రామా, రెండు భాగం కూడా రూపొందుతోంది. అయితే, ‘RRR’ మ్యాజిక్‌ను ‘దేవర’ (Devara) రీక్రియేట్ చేయలేకపోయిందనే కామెంట్స్ గట్టిగానే వచ్చాయి.
ఎన్టీఆర్ లాంటి పవర్‌హౌస్ పెర్ఫార్మర్‌ను సరిగా వాడుకోలేదని, అతని క్యారెక్టర్‌ను సరిగా ప్రజెంట్ చేయడంలో కొరటాల విఫలమయ్యాడని విమర్శలు వచ్చాయి. ‘RRR’తో వచ్చిన క్రేజ్‌ను ‘దేవర’ కాస్త తగ్గించిందని సినీ వర్గాలు అంటున్నాయి. ‘దేవర: పార్ట్ 1’లోని లోపాలను దృష్టిలో పెట్టుకుని, కొరటాల శివ ‘దేవర 2’ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. కథను మరింత పవర్‌ఫుల్‌గా మార్చడంతో పాటు, క్యాస్టింగ్‌లోనూ భారీ మార్పులు చేస్తున్నాడని సమాచారం.
జన్వీ కపూర్ (Janhvi Kapoor) , సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) పాత్రలను మరింత డైనమిక్‌గా రూపొందిస్తూ, కొత్త క్రేజీ ఆర్టిస్ట్‌లను రంగంలోకి దించే ప్లాన్‌లో ఉన్నాడు. ఎన్టీఆర్ క్యారెక్టర్‌ను ఈసారి సరైన రీతిలో ప్రజెంట్ చేసి, ఆడియన్స్ అంచనాలను అందుకునేలా స్క్రిప్ట్‌ను రీడిజైన్ చేస్తున్నాడట. ఈ మార్పులతో ‘దేవర 2’ ఎన్టీఆర్ రేంజ్‌ను మళ్లీ పీక్స్‌కు తీసుకెళ్లే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు.
‘దేవర 2’ షూటింగ్ 2026 ఫిబ్రవరిలో ప్రారంభం కానుందని, ఈ విషయాన్ని నిర్మాత నందమూరి కల్యాణ్‌రామ్ (Nandamuri Kalyan Ram) ఇటీవల వెల్లడించాడు. యువసుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై సుధాకర్ మిక్కిలినేని (Sudhakar Mikkilineni), కల్యాణ్‌రామ్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించనున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి, త్వరలో అధికారిక అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. ఎన్టీఆర్ ప్రస్తుతం ‘వార్ 2’, ప్రశాంత్ నీల్‌తో (Prashanth Neel) ‘డ్రాగన్’ చిత్రాలతో బిజీగా ఉన్నాడు, దీంతో ‘దేవర 2’ షూటింగ్ 2026కి వాయిదా పడింది.