Koratala Siva: స్క్రిప్ట్స్ రెడీ.. కానీ హీరోలే లేరు!

  • April 23, 2022 / 07:09 PM IST

టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు కొరటాల శివ. ఇప్పటివరకు ఆయన తీసిన సినిమాలన్నీ సూపర్ హిట్స్ గా నిలిచాయి. ప్రస్తుతం ఆయన డైరెక్ట్ చేసిన ‘ఆచార్య’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ లు హీరోలుగా కనిపించనున్నారు. ఏప్రిల్ 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా రిలీజ్ తరువాత ఎన్టీఆర్ తో తన తదుపరి సినిమా మొదలుపెట్టనున్నారు కొరటాల శివ.

Click Here To Watch NOW

ఇదిలా ఉండగా.. కొన్నాళ్లక్రితం రామ్ చరణ్ హీరోగా కొరటాల శివ ఓ సినిమాను మొదలుపెట్టారు. కానీ కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది. అలానే కొరటాల దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమా రాబోతుందని అన్నారు. ఏం జరిగిందో తెలియదు కానీ ఆ సినిమాను కూడా పక్కన పెట్టేశారు. ఇప్పుడు ఈ ఇద్దరు హీరోల కోసం అనుకున్న రెండు కథలు కూడా అలానే ఉన్నాయి.

ఎన్టీఆర్ తో కొరటాల చేస్తోన్న సినిమా పూర్తిగా కొత్త కథ. ఈ రెండు కథలతో సంబంధం లేదు. ఇప్పుడు కొరటాల దగ్గర రెండు బౌండెడ్ స్క్రిప్ట్ లు ఉన్నాయి. మరి ఇద్దరు మెగాహీరోలు వదులుకున్న ఈ కథల్లో ఏ స్టార్ హీరోలు నటిస్తారో చూడాలి. ప్రస్తుతం కొరటాల శివ ఫోకస్ మొత్తం ‘ఆచార్య’ సినిమాపైనే ఉంది. ఈ సినిమా రిలీజ్ తరువాత ఎన్టీఆర్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.

ఈ సినిమాపై ఇప్పటినుంచే మంచి బజ్ ఏర్పడింది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో మరోసారి వీరిద్దరూ కలిసి బ్లాక్ బస్టర్ సినిమా ఇస్తారని ఆశిస్తున్నారు ప్రేక్షకులు. ఇక ఈ సినిమాలో అలియాభట్ హీరోయిన్ గా నటిస్తుందనే వార్తలపై స్పందించారు దర్శకుడు కొరటాల. ఇప్పటివరకు హీరోయిన్ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus