టాలీవుడ్ లో టాప్ దర్శకుడిగా మారాలంటే….ఒకప్పుడు ఎన్నో సినిమాలకు అసిస్టెంట్ దర్శకుడిగా పనిచేసి….ఆ తరువాత అసోసీయేట్ దర్శకత్వం వహించి….మెల్లగా దర్శకుడిగా మారేవారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో రైటర్స్ లో ఎక్కువశాతం దర్శకులుగా మారి ఇండస్ట్రీని ఏలుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఇండస్ట్రీలో రైటర్స్ కమ్ డైరెక్టర్స్ హవా మొదలయింది..త్రివిక్రమ్ మొదలుకొని కొరటాల వరకూ ఈ ఫార్ములా వర్కౌట్ అవుటుండ్.
ఇక అదే క్రమంలో కొరటాల విషయమే తీసుకుంటే మంచి కధ, డైలాగ్, స్క్రీన్‌ప్లే రైటర్ గా సినిమాలకు పనిచేస్తున్న ఆయన అనుకోకుండా మిర్చి కధతో ఇండస్ట్రీకి మంచి హిట్ ఇచ్చాడు. అదే క్రమంలో కాస్త గ్యాప్ తీసుకుని ప్రిన్స్ మహేష్ తో “శ్రీమంతుడు”లాంటి డీసెంట్ హిట్ ఇచ్చాడు..ఇక వెనువెంటనే మన యంగ్ టైగర్ తో జనతా గ్యారేజ్” అనే క్లాస్ కమ్ మాస్ హిట్ ఇచ్చి ఈ ముగ్గురు హీరోల కరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ గా నిలిపాడు. అయితే అదే క్రమంలో కొరటాల రెమ్యునిరేషన్ విషయంలో కాస్త డిఫరెంట్ గా ఆలోచిస్తున్నాడు. ఇప్పటివరకూ ఇచ్చింది తీసుకునే పరిస్థితుల్లో ఉన్న ఈ దర్శకుడు ఇప్పుడు శాసించే స్థానంలో ఉండడంతో….కాస్త డిఫరెంట్ గా…రెమ్యునిరేషన్ రూపంలో ఓవెర్సీస్ రైట్స్ పా కన్నేసాడు.
విషయం ఏమిటంటే….ప్రస్తుతం మురుగదాస్ తో సినిమా చేస్తున్న మహేష్ బాబు.. తర్వాత కొరటాలతో ఓ మూవీ చేయబోతున్న క్రమంలో ఈ మూవీ కోసం కొరటాలకు ఆఫర్ చేసిన రెమ్యూనరేషన్ పై ఇప్పుడు రూమర్స్ హల్ చల్ చేస్తున్నాయి. మహేష్ సినిమాకు పారితోషికం రూపంలో కొరటాలకు ఓవర్సీస్ హక్కులు అందనున్నాయనే టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే కనుక.. కొరటాలకు జాక్ పాట్ దక్కినట్లే అని చెప్పుకోవాలి. శ్రీమంతుడు మూవీ ఈ ఏరియాలో 2.89 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. మన కరెన్సీలో ఇది 19 కోట్లకు సమానం. దీన్నే జాక్ పాట్ కొట్టడం అంటారు.