Kota Srinivas Rao: నటుడు కోటా శ్రీనివాసరావు కౌంటర్లు ఆ స్టార్ హీరో పైనేనా?

సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు అందరికీ సుపరిచితమే. గతంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో విలక్షణ నటుడిగా తన సత్తా చాటుకున్నాడు. అయితే ఇప్పుడు వయసు మీద పడటంతో ఆయనకు అవకాశాలు తగ్గాయి. నిజజీవితంలో కోటా శ్రీనివాసరావు ఏ విషయం పై అయినా ముక్కుసూటిగా మాట్లాడుతూ ఉంటారు. ఒక్కోసారి అవి డైజెస్ట్ చేసుకునే విధంగా ఉండవు. మొన్నామధ్య ఓ ఇంటర్వ్యూలో ఆయన టాలీవుడ్ హీరోలందరిపై కౌంటర్లు వేసిన సంగతి తెలిసిందే.

తాజాగా ఎన్టీఆర్ మెమోరియల్ అవార్డ్స్ వేడుకల్లో (Kota Srinivas Rao) కోట శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన హీరోల పారితోషికాల పై కొన్ని షాకింగ్ కామెంట్లు చేశారు. కోటా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ‘‘ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు వంటి వాళ్ళు.. ఏనాడు కూడా తమ పారితోషికం గురించి బాహాటంగా మాట్లాడింది లేదు. కానీ ఇప్పటి హీరోలు మాత్రం రోజుకు రూ.2 కోట్లు, రూ.6 కోట్లు తీసుకుంటున్నాం.. 40 కోట్లు.. 50 కోట్లు అని పబ్లిక్ గా చెబుతున్నారు.

అసలు ఇప్పుడు సినిమా అనేదే లేదు, అంతా సర్కసే. విషాద గీతాలకు కూడా డ్యాన్స్ లు వేయిస్తున్నారు.బాత్రూమ్‌ క్లీన్‌ చేసే బ్రష్‌ దగ్గర్నుండి బంగారం ప్రకటనల దాకా అన్నీ స్టార్‌ హీరోలే చేసేస్తున్నారు. ఇక చిన్న చిన్న ఆర్టిస్టులకు పని ఎక్కడ ఉంటుంది. రెండు పూటలా భోజనం చేస్తున్న సినీ ఆర్టిస్టులు ఎంతమంది ఉన్నారు” అంటూ ఆయన కామెంట్లు చేశారు.

ఇక పారితోషికం గురించి.. ఓపెన్ గా మాట్లాడింది ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే. అది కూడా మొన్నటికి మొన్న పాల్గొన్న ఓ పొలిటికల్ టూర్లో భాగంగా చెప్పాడు. మిగిలిన స్టార్ హీరోలు ఎవరూ కూడా తమ పారితోషికం గురించి మాట్లాడింది లేదు.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus