మొదటిరోజు ‘క్రాక్’ రిలీజ్ లేట్ అవ్వడంతో రవితేజ అభిమానులతో పాటు యావత్ తెలుగు సినిమా అభిమానులు చాలా నిరాశకు గురైన సంగతి తెలిసిందే. అయితే బొమ్మ లేట్ గా పడినా.. బ్లాక్ బస్టర్ అవ్వడం లేట్ అవ్వలేదు అన్నట్టు.. ప్రస్తుతం ‘క్రాక్’ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీని సృష్టిస్తుంది. ‘డాన్‌శీను’, ‘బలుపు’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్స్ తర్వాత మాస్ మహారాజా రవితేజ, గోపిచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం `క్రాక్`. శృతిహాసన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో సముద్రఖని, వరలక్ష్మి శరత్‌కుమార్ లు కీలక పాత్రలు పోషించారు.
’సరస్వతి ఫిలిం డివిజన్’ పతాకం పై బి. మధు నిర్మించిన ఈ చిత్రం మొదటి రోజు కలెక్షన్లను ఓ లుక్కేద్దాం రండి :
నైజాం
2.28 cr
సీడెడ్
1 cr
ఉత్తరాంధ్ర
0.85 cr
ఈస్ట్
0.48 cr
వెస్ట్
0.57 cr
కృష్ణా
0.45 cr
గుంటూరు
0.65 cr
నెల్లూరు
0.26 cr
ఏపీ+తెలంగాణ టోటల్
6.54 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
0.35 cr
ఓవర్సీస్
0.40 cr
టోటల్ వరల్డ్ వైడ్ :
7.29 cr
‘క్రాక్’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 18 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొదటి రోజే ఈ చిత్రం 7.29 కోట్ల షేర్ ను రాబట్టింది.50 శాతం ఆకుపెన్సీతోనే ఈ రేంజ్ కలెక్షన్లను రాబట్టడం అంటే మామూలు విషయం కాదు. మరో 11 కోట్ల వరకూ షేర్ ను రాబడితే.. ఈ చిత్రం క్లీన్ హిట్ గా నిలిచినట్టే..! ఇంకా సంక్రాంతి సెలవులు మిగిలే ఉన్నాయి కాబట్టి.. ఆ టార్గెట్ పెద్ద కష్టమేమి కానే చెప్పాలి.