రవితేజ,శృతీ హాసన్ జంటగా నటించిన తాజా చిత్రం ‘క్రాక్’.గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదలయ్యి బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది. ఆర్ధిక సమస్యల కారణంగా మొదటిరోజు ఈ చిత్రం కాస్త ఆలస్యంగా విడుదల అయ్యింది. దీంతో రవితేజ అభిమానులతో పాటు యావత్ తెలుగు సినిమా అభిమానులు కూడా నిరాశకు గురయ్యారు. అయితే సినిమా మాత్రం సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. దాంతో ‘క్రాక్’ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తుందనే చెప్పాలి. ‘డాన్‌శీను’, ‘బలుపు’ వంటి బ్లాక్‌బస్టర్స్ తర్వాత `క్రాక్` చిత్రంతో వీరు రవితేజ, గోపీచంద్ లు హ్యాట్రిక్ ను కంప్లీట్ చేశారు.
ఇక ఈ చిత్రం 8 రోజుల కలెక్షన్లను ఓ లుక్కేద్దాం రండి :
నైజాం
7.99 cr
సీడెడ్
4.21 cr
ఉత్తరాంధ్ర
2.78 cr
ఈస్ట్
2.09 cr
వెస్ట్
1.74 cr
కృష్ణా
1.62 cr
గుంటూరు
1.94 cr
నెల్లూరు
1.28 cr
ఏపీ+తెలంగాణ టోటల్
23.64 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
1.22 cr
ఓవర్సీస్
0.65 cr
టోటల్ వరల్డ్ వైడ్ :
25.51 cr
‘క్రాక్’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 18 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 8 రోజులకు గాను ఈ చిత్రం 25.51 కోట్ల షేర్ ను రాబట్టింది.50 శాతం ఆకుపెన్సీతోనే ఈ రేంజ్ కలెక్షన్లను రాబట్టడం అంటే మామూలు విషయం కాదు. ఇక ఈ చిత్రం కొన్న బయ్యర్స్ అంతా ఇప్పటికే ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అవ్వడం విశేషం! ఇప్పటికి ఈ చిత్రం 7కోట్ల పైనే లాభాలను వారికి అందించడం విశేషం.