మాస్ మహారాజ్ రవితేజ తాజా చిత్రం ‘క్రాక్’ పండగ ముగిసినా కలెక్షన్ల జోరుని మాత్రం కంటిన్యూ చేస్తూనే ఉంది. గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదలయ్యి బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది. 3 ఏళ్ళ నుండీ సరైన హిట్టు కోసం ఎదురుచూస్తున్న రవితేజకు ఈ చిత్రం పెద్ద రిలీఫ్ ఇచ్చిందనే చెప్పాలి. ‘డాన్‌శీను’, ‘బలుపు’ వంటి బ్లాక్‌బస్టర్స్ తర్వాత `క్రాక్` చిత్రంతో రవితేజ -గోపీచంద్ లు కూడా హ్యాట్రిక్ ను కంప్లీట్ చేశారు.
ఇక ‘క్రాక్’ చిత్రం 9 రోజుల కలెక్షన్లను ఓ లుక్కేద్దాం రండి :
నైజాం
8.45 cr
సీడెడ్
4.49 cr
ఉత్తరాంధ్ర
2.99 cr
ఈస్ట్
2.29 cr
వెస్ట్
1.85 cr
కృష్ణా
1.72 cr
గుంటూరు
2.03 cr
నెల్లూరు
1.35 cr
ఏపీ+తెలంగాణ టోటల్
25.17 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
1.28 cr
ఓవర్సీస్
0.66 cr
టోటల్ వరల్డ్ వైడ్ :
27.11 cr
‘క్రాక్’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 18 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 9 రోజులకు గాను ఈ చిత్రం 27.11 కోట్ల షేర్ ను రాబట్టింది.50 శాతం ఆకుపెన్సీతోనే ఈ రేంజ్ కలెక్షన్లను రాబట్టడం అంటే సాధారణ విషయం కాదు. ఇక ఈ చిత్రం కొన్న బయ్యర్స్ అంతా ఇప్పటికే ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అవ్వడం విశేషం!ఈ చిత్రాన్ని కొనుగోలు చేసిన బయ్యర్లు ఇప్పటివరకూ 9కోట్ల వరకూ లాభాలు పొందారు.