క్రాక్ ఫస్ట్ డే.. ఒక్క షో కలెక్షన్స్ ఎంతంటే..!
- January 10, 2021 / 02:02 PM ISTByFilmy Focus
డాన్‌శీను, బలుపు వంటి బ్లాక్‌బస్టర్ హిట్స్ తర్వాత మాస్ మహారాజా రవితేజ, గోపిచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం `క్రాక్`. శృతిహాసన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో సముద్రఖని, వరలక్ష్మిశరత్‌కుమార్ కీలక పాత్రలు పోషించారు. సరస్వతి ఫిలిం డివిజన్ పతాకంపై బి. మధు నిర్మించిన ఈ చిత్రం నిన్న అంటే జనవరి 9న విడుదల కావాల్సి ఉండగా… ఆర్థిక సమస్యల కారణంగా కేవలం నైట్ షోల తో విడుదల అయ్యింది. పడింది ఒక్క షోనే అయినప్పటికీ ప్రేక్షకులు మాత్రం ఈ చిత్రం చూడటానికి క్యూలు కట్టారని చెప్పొచ్చు.

ఆ ఒక్క షో కలెక్షన్లను గమనిస్తే…
| నైజాం | 0.23 cr |
| సీడెడ్ | 0.05 cr |
| ఉత్తరాంధ్ర | 0.06 cr |
| ఈస్ట్ | 0.05 cr |
| వెస్ట్ | 0.04 cr |
| కృష్ణా | 0.07 cr |
| గుంటూరు | 0.05 cr |
| నెల్లూరు | 0.04 cr |
| ఏపీ+తెలంగాణ | 0.59 cr |
క్రాక్ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో 15 కోట్ల బిజినెస్ జరిగింది. నిన్న పడింది ఒక్క షో మాత్రమే.. అది కూడా 50 శాతం ఆకుపెన్సి తో మాత్రమే…! అయినప్పటికీ ఈ చిత్రం కోటి పైనే గ్రాస్ ను 0.59 కోట్ల షేర్ ను రాబట్టి ఆశ్చర్యపరిచింది. ఇదే జోరు ఆదివారం నాడు కూడా కనబరిస్తే .. 6కోట్ల వరకూ షేర్ వచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు.
Click Here To Read Movie Review
Most Recommended Video
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
అల్లు అర్జున్ నుండి నాగ చైతన్య వరకు.. అందమైన స్టార్ కాపుల్స్.. సతీమణులే స్పెషల్ ఎట్రాక్షన్!

















