Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » కృష్ణ అండ్ హిజ్ లీల సినిమా రివ్యూ & రేటింగ్!

కృష్ణ అండ్ హిజ్ లీల సినిమా రివ్యూ & రేటింగ్!

  • June 25, 2020 / 09:47 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కృష్ణ అండ్ హిజ్ లీల సినిమా రివ్యూ & రేటింగ్!

“క్షణం” చిత్రంతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న ప్రతిభాశాలి రవికాంత్ తన రెండో చిత్రంగా తెరకెక్కించిన సినిమా “కృష్ణ అండ్ హిజ్ లీల”. “గుంటూర్ టాకీస్” ఫేమ్ సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించిన ఈ చిత్రానికి ఆయన రచయితగానూ వర్క్ చేయడం గమనార్హం. లాక్ డౌన్ కారణంగా థియేటర్లో రిలీజ్ అవ్వలేక నెట్ ఫ్లిక్స్ లో ప్రత్యక్షమైన ఈ మోడ్రన్ లవ్ స్టోరీ ఎలా ఉందో చూద్దాం..!!

కథ: కృష్ణ (సిద్ధూ జొన్నలగడ్డ) ఓ నవతరం యువకుడు. చిన్నప్పుడే తండ్రి దూరమవ్వడంతో (ఇక్కడ దూరమవ్వడం అంటే చనిపోవడం కాదు.. అతని దగ్గర లేకపోవడం) తల్లి పెంపకంలో ఆధునిక భావాలతో పెరుగుతాడు. సగటు యువకుడిలాగే కాలేజ్ లో లవ్ స్టోరీ, వెంటనే బ్రేకప్.. ఆ తర్వాత మళ్ళీ లవ్.. అది బ్రేకప్ అయ్యేలోపు పాత లవ్ తో మళ్ళీ ప్యాచప్. అయితే.. ఈ బ్రేకప్ & ప్యాచప్ నడుమ చిన్న కన్ఫ్యూజన్, ఆ కన్ఫ్యూజన్ లో కూడా చిన్న క్లారిటీ ఉంటుంది. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ చివరికి ఏ తీరానికి చేరింది అనేది నెట్ ఫ్లిక్స్ లో సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయం.

నటీనటుల పనితీరు: సిద్ధూ పోషించిన కృష్ణ అనే క్యారెక్టర్ కు మెజారిటీ యూత్ కనెక్ట్ అవ్వడం పక్కా.. అందుకు ముఖ్య కారణం సిద్ధూ నటన అయితే.. ఆ క్యారెక్టరైజేషన్ ను తీర్చిదిద్దిన విధానం మరో కారణం. చాలా ఈజ్ తో ఎక్కడా అతి లేకుండా.. చాలా రియలిస్టిక్ గా రోల్ ను క్యారీ చేశాడు.

శ్రద్ధా శ్రీనాధ్ పోషించిన సత్య క్యారెక్టర్ భారతంలో కోపిష్టి సత్యను గుర్తు చేస్తుంది. బేసిగ్గా అబ్బాయిలకు గట్టిగా కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ సత్యది. ఎందుకంటే.. 90% మంది అబ్బాయిలు ఇలాంటి సత్య అనే అమ్మాయిని తమ లైఫ్ లో ఒక్కసారినా చూసి ఉంటారు. ఈ అమ్మాయిలకు కోపం ఎందుకు వస్తుందో, ఎందుకు దూరంగా వెళ్లిపోతారో, మళ్ళీ ఎందుకు దగ్గరగా వస్తారో ఎవరికీ అర్ధం కాదన్నమాట. నాకు పర్సనల్ గా నచ్చిన క్యారెక్టర్ కూడా ఇదే.

షాలిని వాడికంటి పోషించిన రాధ పాత్ర కూడా మనకు తారపడుతూనే ఉంటుంది. అబ్బాయిలను ప్రేమతో కంటే ఎమోషనల్ గా ఎక్కువగా కనెక్ట్ చేసి.. తమ వెంట తిప్పుకోవాలని ప్రయత్నిస్తుంటారు. ఎమోషనల్లీ వీక్ బట్ మెంటల్లీ చాలా స్ట్రాంగ్ అన్నమాట. ఎక్కడ ఏ విధంగా ఎమోషనల్ గా నొక్కితే అబ్బాయి మాట వింటాడో, చెప్పుచేతల్లో ఉంటాడో పర్ఫెక్ట్ గా తెలిసిన తెలివైన అమాయకురాలు రాధ. ఈ క్యారెక్టర్ కి షాలిని సరిగా యాప్ట్ అవ్వలేదు. పాత్రలో ఉన్న అమాయకత్వం, బేలతనం అమ్మాయి ముఖంగాలో కనిపించలేదు.

ఇక కృష్ణగాడి మూడో ఇంట్రెస్ట్ రుక్సార్ గా నటించిన సీరత్ కపూర్. జీవితం మీద, ప్రేమ మీద మంచి క్లారిటీ ఉన్న ఆధునిక యువతి. ఎంత క్లారిటీ అంటే లవ్ కి లవ్ మేకింగ్ కి మధ్య ఉన్న తేడాను గమనించి.. ఆ తేడాను ఇతరులకు కూడా వివరించేంత. సీరత్ ఈ రోల్ కి ఎగ్జాక్ట్ గా సెట్ అయ్యింది. ప్రెజంట్ జనరేషన్ అమ్మాయిల్లో లేని క్లారిటీని సీరత్ పాత్రలో చూపించి.. ఇలా ఉంటే ఏ గోల ఉండదు అనేది క్లారిటీ ఇచ్చారు దర్శక రచయితలు. తల్లి పాత్రలో ఝాన్సీ, తండ్రి పాత్రలో సంపత్, చెల్లెలి పాత్రలో సంయుక్త హెగ్డే, స్నేహితుడి పాత్రలో వైవా హర్ష అలరించారు.

సాంకేతికవర్గం పనితీరు: సాంకేతికంగా సినిమా గురించి ముందుగా చెప్పుకోవాల్సింది ప్రొడక్షన్ డిజైన్ గురించి. కొన్ని ఏళ్ళు తరబడి చేసిన ప్రీప్రొడక్షన్ వల్ల కావచ్చు.. మేకర్స్ కి సీన్ డివిజన్ మీద ఉన్న క్లారిటీ వల్ల కావచ్చు తక్కువ బడ్జెట్ లో అద్భుతమైన అవుట్ పుట్ తీసుకొచ్చారు. అందుకు ప్రొడక్షన్ డిజైన్ టీంను మెచ్చుకోవాలి. అలాగే.. షానిల్ డియో-సాయిప్రకాశ్ ఉమ్మడిసింగు కలిసి చేసిన సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకి మెయిన్ ఎస్సెట్. కథ హైద్రాబాద్-బెంగుళూరు మధ్య నడుస్తుంది. అయితే.. లోకల్ లొకేషన్స్ తోనే ఆ డిఫరెన్స్ ను బాగా ఎలివేట్ చేశారు. అందుకు వారిద్దరినీ మెచ్చుకోవాలి. థ్రిల్లర్స్ కు కేరాఫ్ అడ్రెస్ అయిన శ్రీచరణ్ పాకాల మెలోడీస్ తోనూ మాయ చేయగలను అని మరోసారి ప్రూవ్ చేసుకొన్నాడు.

ఇప్పుడు మన డైరెక్టర్ రవికాంత్ గురించి మాట్లాడుకోవాలి.. మనోడు క్షణం తర్వాత కాస్త గట్టి గ్యాప్ తీసుకొన్నాడు. రవికాంత్ రెండో సినిమా ఎప్పుడు వస్తుందా అని జనాలు ఆలోచించి, ఒకానొక దశలో పట్టించుకోవడం మానేశారు కూడా. దాంతో “క్షణం” క్రెడిట్ మొత్తం అడివి శేష్ ఎకౌంట్ లో పడిపోయింది. సొ, రవికాంత్ సెకండ్ సినిమా మీద ఆశలు లేవు, అంచనాలు లేవు. కానీ.. ఏమాత్రం తేడా కొట్టినా మనోడి టాలెంట్ మీద అనుమానాలు రేగుతాయి. ఈ ప్రేజర్ వల్లే ఎక్కువ గ్యాప్ తీసుకొన్నాడేమో అనిపించింది. అయితే.. క్షణంలో ఒక తల్లి తన కూతురు కోసం పడే తాపత్రయాన్ని ఎంత రియలిస్టిక్ గా తెరకెక్కించాడో.. ఈ సినిమాలో కృష్ణ ప్రేమ కథను, అతడి వ్యధను అంతే రియలిస్టిక్ గా చూపించాడు రవికాంత్. ముఖ్యంగా.. సిద్ధూ-సంపత్ నడుమ బార్ లో జరిగే డిస్కషన్ లో ఒక కొడుకు బాధను చాలా సింపుల్ & ఎఫెక్టివ్ గా చూపించాడు. అలాగే.. ప్రీక్లైమాక్స్ లో సిద్ధూ-షాలిని-శ్రద్ధా శ్రీనాథ్ ల నడుమ సాగే గొడవలాంటి సంభాషణను కూడా అంతే మెచ్యూర్డ్ గా చూపించాడు. సో, సెకండ్ సినిమా సిండ్రోమ్ నుండి సక్సెస్ ఫుల్ గా బయటపడ్డాడు రవికాంత్.

విశ్లేషణ: ప్రెజంట్ జనరేషన్ యూత్ ప్రేమ అనే విషయంలో ఎంత కన్ఫ్యూజ్డ్ గా ఉంటున్నారు? వాళ్ళకి కావాల్సిన క్లారిటీ ఏమిటి? వంటి ప్రశ్నలకు సమాధానం “కృష్ణ అండ్ హిజ్ లీల”. సూటిగా సుత్తి లేకుండా 2.05 గంటల్లో కృష్ణగాడు చెప్పిన, చేసిన లీలను నెట్ ఫ్లిక్స్ లో చూసి ఆనందించండి.

రేటింగ్: 3/5

Click Here To Read English Review

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Krishna And his leela
  • #Seerat Kapoor
  • #Shalini
  • #Shraddha Srinath
  • #Siddhu j

Also Read

Spirit: బ్లాక్ బస్టర్ వైబ్స్ ఇచ్చిన ‘స్పిరిట్’ ఆడియో క్లిప్.. కథ పై కూడా హింట్ ఇచ్చేశారుగా

Spirit: బ్లాక్ బస్టర్ వైబ్స్ ఇచ్చిన ‘స్పిరిట్’ ఆడియో క్లిప్.. కథ పై కూడా హింట్ ఇచ్చేశారుగా

Kiran Abbavaram: అతనితో హ్యాట్రిక్ కొట్టిన కిరణ్ అబ్బవరం..?!

Kiran Abbavaram: అతనితో హ్యాట్రిక్ కొట్టిన కిరణ్ అబ్బవరం..?!

Bison Review Telugu: బైసన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Bison Review Telugu: బైసన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dude Collections: 6వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘డ్యూడ్’

Dude Collections: 6వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘డ్యూడ్’

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ ఇలా అయితే కష్టం కదా!

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ ఇలా అయితే కష్టం కదా!

Kantara Chapter 1 Collections: 3వ వారం కూడా పర్వాలేదనిపించిన ‘కాంతార చాప్టర్ 1’.. కానీ!

Kantara Chapter 1 Collections: 3వ వారం కూడా పర్వాలేదనిపించిన ‘కాంతార చాప్టర్ 1’.. కానీ!

related news

Bison Review Telugu: బైసన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Bison Review Telugu: బైసన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Thamma Review in Telugu: థామా సినిమా రివ్యూ & రేటింగ్!

Thamma Review in Telugu: థామా సినిమా రివ్యూ & రేటింగ్!

K-Ramp Review in Telugu: K ర్యాంప్ సినిమా రివ్యూ & రేటింగ్!

K-Ramp Review in Telugu: K ర్యాంప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dude Review in Telugu: డ్యూడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dude Review in Telugu: డ్యూడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Telusu Kada Review in Telugu: తెలుసు కదా సినిమా రివ్యూ & రేటింగ్!

Telusu Kada Review in Telugu: తెలుసు కదా సినిమా రివ్యూ & రేటింగ్!

Mithra Mandali Review in Telugu: మిత్ర మండలి సినిమా రివ్యూ & రేటింగ్!

Mithra Mandali Review in Telugu: మిత్ర మండలి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Spirit: బ్లాక్ బస్టర్ వైబ్స్ ఇచ్చిన ‘స్పిరిట్’ ఆడియో క్లిప్.. కథ పై కూడా హింట్ ఇచ్చేశారుగా

Spirit: బ్లాక్ బస్టర్ వైబ్స్ ఇచ్చిన ‘స్పిరిట్’ ఆడియో క్లిప్.. కథ పై కూడా హింట్ ఇచ్చేశారుగా

1 hour ago
Kiran Abbavaram: అతనితో హ్యాట్రిక్ కొట్టిన కిరణ్ అబ్బవరం..?!

Kiran Abbavaram: అతనితో హ్యాట్రిక్ కొట్టిన కిరణ్ అబ్బవరం..?!

3 hours ago
Bison Review Telugu: బైసన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Bison Review Telugu: బైసన్ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Dude Collections: 6వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘డ్యూడ్’

Dude Collections: 6వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘డ్యూడ్’

18 hours ago
Telusu Kada Collections: ‘తెలుసు కదా’ ఇలా అయితే కష్టం కదా!

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ ఇలా అయితే కష్టం కదా!

18 hours ago

latest news

Mithra Mandali Collections: ‘మిత్ర మండలి’ కి.. 25 శాతం రికవరీ కూడా సాధించలేదు..!

Mithra Mandali Collections: ‘మిత్ర మండలి’ కి.. 25 శాతం రికవరీ కూడా సాధించలేదు..!

18 hours ago
K-Ramp Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘K-RAMP’

K-Ramp Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘K-RAMP’

18 hours ago
Vash 2: హాలీవుడ్ రేంజ్ హారర్ థ్రిల్లర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Vash 2: హాలీవుడ్ రేంజ్ హారర్ థ్రిల్లర్.. అస్సలు మిస్ అవ్వకండి!

20 hours ago
Rashmika Mandanna: వేల కోట్ల హీరోయిన్.. 35 లక్షల వసూళ్లా?

Rashmika Mandanna: వేల కోట్ల హీరోయిన్.. 35 లక్షల వసూళ్లా?

21 hours ago
Arka Media: ‘బాహుబలి’ హ్యాంగోవర్.. రాజమౌళి లేని ఆర్కాకు ఆ సత్తా లేదా?

Arka Media: ‘బాహుబలి’ హ్యాంగోవర్.. రాజమౌళి లేని ఆర్కాకు ఆ సత్తా లేదా?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version